కొత్త సందడి మొదలైంది

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. ఈ మూవీ మహేష్‌కు 25వ సినిమా కావడంతో చాలా కెర్ తీసుకోని సినిమా చేస్తున్నాడు. ఇందులో మహేష్ టూ డిఫరెంట్ వెరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ స్పెషల్ సెట్లో అల్లరి నరేష్ , మహేష్ బాబు మధ్య కీలక సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి మహేష్ బర్త్ డే రోజు రిలీజ్ చేసిన టీజర్‌, ఫస్ట్ లుక్ తప్ప మరో లుక్ రివిల్ చేయలేదు. అందుకే ఓ పోస్టర్‌ను 2019 జనవరి 1న రిలీజ్‌ చేసి ఆడియన్స్‌కు న్యూ ఇయర్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రటీమ్. ఏప్రిల్‌ 5న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని కాస్త గ్యాప్ తరువాత మళ్లీ సినిమాల స్పీడ్ పెంచాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ బ్యాగ్ డ్రాప్‌ రూపొందుతున్న జెర్సీ మూవీ చేస్తున్నాడు. ఇందులో నాని డబుల్ రోల్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని జనవరి 1న రిలీజ్ చేయబోతున్నారు చిత్రటీమ్. ఇందులో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తోంది. వరుస రెండు ప్లాప్‌లు అందుకున్న నాని ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. సమ్మర్ కానుకగా ఏప్రిల్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

నా పేరు సూర్య సినిమా తరువాత నెక్ట్ప్ సినిమా అనౌన్స్ విషయంలో మౌనంగా ఉన్న బన్ని ఈ న్యూ ఇయర్‌కు ఆ మౌనాన్ని బ్రేక్‌ చేయనున్నాడు. కొత్త ఏడాది రోజు ఫ్యాన్స్ కు కొత్త సినిమా కబురు చెప్పాబోతున్నాడట. 2019 జనవరి 1న న్యూ మూవీని అనౌన్స్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే విక్ర‌మ్ కుమార్‌తో మూవీ చేస్తాడ‌నే టాక్ వినిపించినప్ప‌టికి ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ పేరు ఫ్రేములోకి వ‌చ్చింది. ఇటీవ‌ల జ‌రిగిన విన‌య విధేయ రామ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో చిరు త‌న త‌ర్వాతి చిత్రాన్ని త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించడంతో అభిమానుల‌లో మ‌ళ్లీ అనుమానాలు మొద‌లయ్యాయి. దీంతో అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ చిత్రానికి దర్శకుడు ఎవరు? అనేది సస్పెన్స్ మారింది. అయితే గీత గోవిందం వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ మూవీ ఉంటుంద‌నే టాక్ వినిపిస్తోంది. దీనిపై మరింత క్లారిటీ జ‌న‌వ‌రి 1న రానుంది.

కోలీవుడ్‌ వర్సటైల్ యాక్టర్ సూర్య కొద్ది రోజులుగా సక్సెస్ దూరంగా ఉంటున్నాడు. అందుకే నెక్ట్స్ సినిమాల విషయంలో అచితూచి సెలక్ట్ స్టోరీస్‌తో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో, డిఫరెంట్ స్ర్కీన్ ప్లేతో మ్యాజిక్ చేసే కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు ఈ కాంబినేషన్‌లో బ్రదర్స్ మూవీ వచ్చింది. ఆ సినిమా యావరేజ్ హిట్ అయింది. ఇప్పడు కూడా డిఫరెంట్‌గా స్టోరీతోనే సినిమా చేస్తున్నారు..అయితే ఈ మూవీకి మీట్పవన్, కాప్పన్, ఉయిర్కా మూడు పేర్లు పరిశీలుస్తున్నారు. ఈ మూడు టైటిల్స్‌లో ఏ టైటిల్‌ ఫైనల్‌ అనేది 2019 జనవరి 1న అనౌన్స్ చేయబోతున్నారు.