సినిమా

Adivi Sesh: సన్నీలియోన్ అంటూ ఏడిపించేవారు..అందుకే పేరు మార్చుకున్నా: అడివి శేష్‌

Share

Adivi Sesh: టాలెంటెడ్ హీరో అడివి శేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సొంతం` మూవీతో 2002లోనే సినీ గ‌డ‌ప తొక్కిని అడివి శేష్‌.. `క్షణం` హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత అమీ తుమీ, గూఢచారి, ఎవరు వంటి విభిన్న‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కులు బాగా చేరువైన ఈ హీరో.. ఇప్పుడు `మేజ‌ర్‌`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

శశికిరణ్ తిక్కా దర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టించింది. శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రేవతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

అలాగే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ మూవీకి వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగానే అడివి శేష్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న సినిమా విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను షేర్ చేకున్నారు. అలాగే తాను త‌న పేరును మార్చుకున్న‌ట్లు కూడా పేర్కొన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ.. `నా అసలు పేరు అడివి సన్నీ కృష్ణ.. కానీ అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్‌ అని ఆటపట్టిస్తూ ఏడిపించేవారు. అందుకే అడివి శేష్‌గా మార్చుకున్నా` అంటూ సీక్రెట్ రివిల్ చేయ‌గా.. అది కాస్త వైర‌ల్‌గా మారింది.


Share

Related posts

హైదరాబాద్ లోనే ప్రభాస్ పూజా హెగ్డేల సినిమా షూటింగ్ ..విదేశాలకి వెళ్ళే ప్రసక్తే లేదు ..!

GRK

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ ని పొగడ్తలతో ముంచెత్తిన పవన్..!!

sekhar

చిరంజీవి ఆచార్య : అప్పుడే వివాదం మొదలైంది .. కొరటాల రంగంలోకి దిగాల్సిందే !

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar