బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ యాక్షన్ సన్నివేశాల్లో డూపు లేకుండా నటించడానికి ఇష్టపడతాడు. అందుకే అతన్ని అందరూ ఖిలాడి అంటుంటారు. ఈయన ఇప్పుడు `ది ఎండ్` అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. తర్వలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. దీని గురించి వివరాలు చెప్పడానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అక్షయ్ చేసిన రిస్కీ స్టంట్ అందర్నీషాక్కి గురిచేసింది. టైటిల్‌ను అనౌన్స్ చేయడానికి స్టేజ్‌పైకి అక్షయ ఒళ్లంతా మంటలు పెట్టుకుని వచ్చాడు. ఇంత రిస్కీ స్టంట్ అవసరమా అని సన్నిహితులు చెప్పినా వినలేదు. తగు జాగ్రత్తలతోనే ఈ రిస్క్ చేశాడు. ఈ విషయాన్ని తన భార్య ట్వింకిల్ ఖన్నాకు కూడా చెప్పలేదు. “నీకు నువ్వుగా మంటల్లో ఉండటానికి అంగీకరించావా! దీన్ని నుండి తప్పించుకుని ఇంటికి రా.. నేను నిన్ను చంపేస్తా!“ అంటూ స్టేజ్‌పై అక్షయ్ చేసిన ఫీట్‌ను చూసి ట్వింకిల్ పెట్టిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటుంది. మరిప్పుడు భార్య అక్షయ్ ఎలా సర్ది చెప్పుకుంటాడో మరి.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!