Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. `ప్రేమమ్` అనే మలయాళ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసిన అనుపమ.. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన `అ ఆ` మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ద్వారా అనుపమకు పెద్దగా ఒరిగిందేమి లేకున్నా.. ఆ తర్వాత `శతమానం భవతి`లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.
అయితే అందం, అభినయం, అంతకు మించి టాలెంట్ ఉన్నప్పటికీ అనుపమ స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది. ఈమె చివరిగా `రౌడీ బాయ్స్` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. దిల్ రాజు తమ్ముడి కుమారుడు ఆశిష్ రెడ్డి డబ్యూ చిత్రమిది. జనవరి 14న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం అనుపమ హీరో నిఖిల్‌తో `18 పేజీస్`, `కార్తికేయ 2` చిత్రాలు చేస్తోంది. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ కేరళ కుట్టి.. తరచూ తనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌కు మతిపోగొడుతుంటుంది. అయితే తాజాగా అనుపమ మేకప్ లేకుండా దర్శనమిచ్చింది.
మేకప్ లేకుండా క్యూట్ క్యూట్‌గా ఫేస్ ఎక్స్ ప్రేషన్స్ ఇస్తూ క్లోజ్ అప్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు.. వామ్మో మేకప్ లేకపోయినా అనుపమ ఇంత అందంగా ఉండేంటి అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.