Anupama Parameswaran: ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు అశీష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `రౌడీ బాయ్స్`. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు కలిసి నిర్మిస్తున్నారు. అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కాబోతుండగా.. నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రౌడీ బాయ్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
అలాగే ఈ సందర్భంగా రౌడీ బాయ్స్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని తారక్ ఆకాక్షించారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే యూత్ పుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమని ట్రైలర్ బట్టీ స్పష్టంగా అర్థమైంది. ఇంజినీరింగ్ స్టూడెంట్ అయిన హీరో.. మెడికల్ కాలేజీకి చెందిన హీరోయిన్ అనుపమని ప్రేమించడం వల్ల జరిగిన గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
అయితే ఈ సినిమా ట్రైలర్లో హైలైట్ అయిన విషయం ఏంటంటే.. అనుపమ అశీష్కి లిప్ కిస్ ఇవ్వడం. కెరీర్ స్టార్టింగ్ నుంచీ రొమాంటిక్ సన్నివేశాలకు ఆమడ దూరంలో ఉంటూ వస్తోన అనుపమ.. గతంలో లిప్ లాక్ సన్నివేశం ఉందని ఓ సినిమాను సైతం రిజెక్ట్ చేసింది. అలాంటి ఆమె ఇప్పుడు నిర్మాత కొడుకుతో లిప్ లాక్ సీన్లలో నటించడం సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ విషయంలో అనుపమపై ఆమె తల్లి కూడా చాలా సీరిస్‌గా ఉన్నారట. అనుపమ అలాంటి సన్నివేశంలో నటించడం ఆమె తల్లికి ఏ మాత్రం నచ్చలేదని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!