NBK107: `అఖండ`తో భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ కలిసి నిర్మిస్తున్నారు.
ఇటీవలె తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంమైంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా మేకర్స్ బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. మైనింగ్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో పంచె, బ్లాక్ షర్ట్, కళ్ళద్దాలు ధరించి మాస్ గెటప్ లో పవర్ ఫుల్‌గా బాలయ్య నడిచొస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. అంత అద్భుతంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే గోపీచంద్ మలినేని సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాడు.
ఇకపోతే.. ఈ సినిమాపై ఓ ఆసక్తికర టాక్ నెట్టింట జోరుగా నడుస్తోంది. అదేంటంటే..గతంలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ `మఫ్టీ` అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే మఫ్టీ మూవీకి బాలయ్య ఎన్బీకే 107 రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
NATASIMHAM #NandamuriBalakrishna in his MASSiest Avatar ever 🔥
Here's the Menacing First Look of #NBK107 💥#NBK107HuntBegins@shrutihaasan @officialviji @varusarath5 @megopichand @MusicThaman pic.twitter.com/lk7PyCjWpE
— Mythri Movie Makers (@MythriOfficial) February 21, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!