Beast: తమిళనాట మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్థార్ హీరో దళపతి విజయ్ తాజా చిత్రమే `బీస్ట్`. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. సెల్వ రాఘవన్ , విటివి గణేశ్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
భారీ అంచనాల నడుము ఏప్రిల్ 13న రిలీజ్ అయిన ఈ మూవీ తొలి రోజే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. అదిరిపోయే కథ, ఆకట్టుకునే కథనం లేకపోయినా.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ స్టైల్ మరియు నటన, విజువల్స్, అనిరుధ్ అందించిన సంగీతం వంటి అంశాలు అలరిస్తాయి. అలాగే విజయ్ కు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది.
ఈ నేపథ్యంలోనే నెగటివ్ టాక్ ఉన్నా ఆయన బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూ అదరగొట్టేస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 6.58 కోట్ల షేర్, రూ. 11.55 కోట్ల గ్రాస్ వసూల్ చేసి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. ఇక ఏరియాల వారీగా బీస్ట్ ఫస్ట్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ను పరిశీలిస్తే..
నైజాం: 2.54 కోట్లు
సీడెడ్: 1.02 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.75 కోట్లు
తూర్పు: 0.46 కోట్లు
పశ్చిమ: 0.37 కోట్లు
గుంటూరు: 0.53 కోట్లు
కృష్ణ: 0.55 కోట్లు
నెల్లూరు: 0,36 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ=6.58 కోట్లు(11.55కోట్లు~ గ్రాస్)
—————————–
కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల మేర ప్రీ రిలీజ్ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 10.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఇక ఇప్పుడు ఇక్కడ ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే.. మొదటి మూడు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 3.92 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!