Bheemla Nayak: సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త హీనన్ హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. తమన్ స్వరాలు సమకూర్చారు.
భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిజాయితీపరుడైన ఎస్సై భీమ్లా నాయక్ పాత్రలో పవన్ ఒదిగిపోగా.. బాగా పొగరు ఉన్న రాజకీయ నేత, రిటైర్డ్ ఆర్మీ అధికారి డేనియల్ శేఖర్‌గా రానా అద్భుతమైన నటను కనబరిచాడు. వీరిద్దరి నటనా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, తమన్ సంగీతం, సాగక్ టేకింగ్ సినిమాకు ప్రధాన ప్లాస్ పాయింట్స్‌గా నిలిచింది.
అలాగే కలెక్షన్ల పరంగానూ పవన్, రానాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేశారు. మొదటి రోజు తెలుగులో రాష్ట్రాల్లో 26.42 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా 36.37 కోట్ల షేర్‌ను కొల్లగొట్టింది. ఇక ఏరియాల వారిగా భీమ్లా నాయక్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి..
నైజాం- 11.85 కోట్లు
సీడెడ్- 3.28 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.88 కోట్లు
తూర్పు గోదావరి: 1.95 కోట్లు
పశ్చిమ గోదావరి: 3.02 కోట్లు
గుంటూరు: 2.51కోట్లు
కృష్ణ: 0.89కోట్లు
నెల్లూరు: 1.04కోట్లు
————————————————————-
ఏపీ+తెలంగాణ- 26.42 కోట్లు(38కోట్లు~ గ్రాస్)
————————————————————-
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా- 3.10 కోట్లు
ఓవర్సీస్- 6.85 కోట్లు
—————————————————————————-
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్- 36.37కోట్లు(56.50కోట్లు~ గ్రాస్)
—————————————————————————-
కాగా, రూ. 108 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన భీమ్లా నాయక్.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 71.63 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!