NewsOrbit
Entertainment News సినిమా

NBK108: బాలకృష్ణ… అనిల్ రావిపూడి సినిమాలో బాలీవుడ్ నటుడు..!!

Share

NBK108: నటసింహం నందమూరి బాలయ్య బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK 108” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీ లీల.. బాలయ్య కూతురు పాత్రలో కనిపిస్తోంది. బాలయ్య జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంలో… ఆ ప్రాంత యాసాతో కూడిన డైలాగ్ డెలివరీతో బాలకృష్ణ ఈ సినిమాలో మాస్ డైలాగ్స్ చెప్పనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల టాలీవుడ్ సినిమాలలో బాలీవుడ్ స్టార్ నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా కొత్త షెడ్యూల్ ఆయన పాల్గొనట్లు చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ వెల్కమ్ చెబుతూ విడుదల చేయడం జరిగింది.

Bollywood actor arjun rampal play key role in Balakrishna Anil Ravipudi movie

ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే అది విలన్ పాత్ర లేదా… వేరేదా అన్నదాని విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ దసరా పండుగకు ఈ సినిమా విడుదల కానుంది. అనిల్ రావిపూడి పంచ్ మిస్ అవ్వకుండా కామెడీ యాక్షన్ నేపథ్యంలో… కొద్దిగా సెంటిమెంటు జోడించి.. సరికొత్తగా బాలయ్యని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం. జూన్ నెలలో బాలకృష్ణ పుట్టినరోజు కావటంతో ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటించబోతున్నట్లు సమాచారం.

Bollywood actor arjun rampal play key role in Balakrishna Anil Ravipudi movie

ఫస్ట్ గ్లింప్స్ వీడియో కూడా అప్పుడే విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో 60 ఏళ్ల వృద్ధుడి పాత్రలో.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా బాలయ్య చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కొన్ని వారాల క్రితం ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలయ్య మీసాలు గతంలో ఎన్నడూ లేని రీతిలో వైవిధ్యంగా ఉండటంతో సినిమా… పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

`చూసీ చూడంగానే` ఫస్ట్ లుక్‌ రిలీజ్

Siva Prasad

మలయాళం భాషలో “RRR” మరో రికార్డ్..!!

sekhar

Karthika deepam: నాన్నమ్మను చూసిన సంతోషంలో జ్వాల… చెంప పగలకొట్టి జ్వాల ఆనందాన్ని ఆవిరి చేసిన సౌందర్య..!!

Ram