“లైగర్” సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ “లైగర్” ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్ 7 కట్స్ చెప్పటం జరిగింది అంట. చాలా చోట్ల ఉపయోగించిన Fతో మొదలయ్యే అసభ్యకరమైన పదజాలం మ్యూట్ చేయాలని తెలపడం జరిగిందంట. ఇదే సమయంలో సైగల్ తో చేసే కొన్ని సన్నివేశాలను బ్లర్ చేయాలని, విజయ్ చేతులతో సంజ్ఞ చేసే సన్నివేశం పూర్తిగా తొలగించాలని సూచించడం జరిగింది.
దీంతో “లైగర్” సినిమా యూనిట్ ఈ అభ్యంతరాలను సరి చేసే పనిలో పడింది. అయితే సెన్సార్ బోర్డు తాజాగా సూచించిన సన్నివేశాలు సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల టైంలో వచ్చేవి అని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. “లైగర్” విడుదలకు ఇంకా వారం రోజులు టైం ఉంది. దీంతో ప్రస్తుతం సినిమా యూనిట్ ఒకపక్క సెన్సార్ చెప్పిన సూచనలు పాటిస్తూ మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో స్పీడ్ పెంచడం జరిగింది.
ఫస్ట్ టైం డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ టచ్ చేస్తున్నారు. మరి ఏ స్థాయి విజయం సాధిస్తాడా అని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ ఆశల మొత్తం “లైగర్” పైనే పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్ లలో ఉన్నాడు. దీంతో “లైగర్” తో విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ దాదాపు రెండు సంవత్సరాల పాటు బాడీ వర్క్ అవుట్ చేయడం జరిగింది. మరీ “లైగర్” తో రౌడీ విజయ్ విజయం సాధిస్తడో లేదో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!