సినిమా

Aacharya: “ఆర్ఆర్ఆర్”లో “నాటునాటు” సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్స్ పై చిరంజీవి వైరల్ కామెంట్స్..!!

Share

Aacharya: మార్చి 25 వ తారీకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. రాజమౌళి టేకింగ్ తో పాటు ఎన్టీఆర్- చరణ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది. ఇద్దరు హీరోలు నువ్వానేనా అన్నట్టుగా నటించడం మాత్రమే కాదు స్టెప్పులు కూడా ఇరగదీశారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ అవ్వక ముందే “నాటు నాటు” స్టెప్ దేశవ్యాప్తంగా వైరల్ కావడం తెలిసిందే. చరణ్ తారక్ కలసి వేసిన ఈ స్టెప్ ఈ సినిమాలో కూడా హైలెట్ గా నిలిచింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ స్టెప్పు పై మెగాస్టార్ చిరంజీవి వైరల్ కామెంట్లు చేశారు. Viral Video: నాటు నాటు పాటకు క్రేజ్ మాములుగా లేదుగా.. పెళ్లి రిసెప్షన్‌లో  అందరూ కలిసి.. | Naatu naatu song ram charan and ntr signater step trying in  marriages video goes viral | TV9 Teluguముఖ్యంగా తారక్ డ్యాన్స్ గురించి చిరంజీవి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి- చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఈనెల 29వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీంతో విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా.. మొదటిగా కొరటాల శివ, చిరు, చరణ్ కలిసి.. వీడియో రూపంలో సినిమా గురించి చర్చించుకున్నారు. Acharya trailer: Father-son duo Chiranjeevi and Ram Charan join hands to  protect sacred landఈ సందర్భంగా చిరంజీవి సినిమా గురుంచి… మాట్లాడుతూ చరణ్ తో స్టెప్పులు నావల్ల కాదు.. “ఆర్ఆర్ఆర్” లో తారక్.. చరణ్ కలిసి “నాటు నాటు” సాంగ్ లో ఇరగదీసేశారు. ఆ సాంగ్ చూశాక ఇప్పుడు చరణ్ తో కలిసి స్టెప్పులు చేయాలంటే భయమేస్తుంది.. అంటూ చిరంజీవి తనదైన శైలిలో సరదాగా డైలాగులు వేయడం జరిగింది. ఇదిలా ఉంటే “ఆచార్య లో ఒక సాంగ్ లో చిరు, చరణ్ కలిసి స్టెప్ లు వెయ్యనున్నారట. ఈ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ పని చేయడం జరిగిందట. చాలా హైలెట్ స్టెప్పులు ఇద్దరూ.. ఓకే రిథమ్ లో పాటలో వేసినట్లు.. సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం.


Share

Related posts

25 ఏళ్ల ‘రిక్షావోడు’.. చిరంజీవికి మరో టర్నింగ్ పాయింట్

Muraliak

Anasuya: అనసూయ ప్లేస్ రీప్లేస్ చేస్తున్న ఆర్ఎక్స్ 100 హీరోయిన్…??

sekhar

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన గోవా బ్యూటీ

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar