Daggubati Rana: తెలుగు చలనచిత్ర రంగంలో కొత్త నటీనటులను పరిచయం చేయటంలో ఎప్పుడు ముందుండే దర్శకుడు తేజ. ప్రేమ కథ నేపథ్యం కలిగిన సినిమాలను చాలా వైవిధ్యంగా తెరకెక్కిస్తూ ఎన్నో హిట్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకున్నారు. దివంగత ఉదయ్ కిరణ్ తో చేసిన చిత్రం, నువ్వు నేను సినిమాలు ఆయన కెరియర్ లోనే ఎంతో మంచి పేరుని తీసుకొచ్చాయి. అప్పట్లో ఆ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. నితిన్ తో చేసిన “జయం” సినిమా కూడా “తేజ” దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. కాగా ప్రస్తుతం దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ “అహింసా” సినిమాని తెరకెక్కించటం జరిగింది.
జూన్ రెండవ తారీఖు ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ తనకి కలిసొచ్చిన ప్రేమ కథ జోనర్ లోనే ఈ సినిమాని రూపొందించాడు. ఈ సినిమా తర్వాత తేజ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనే ప్రశ్నకు సమాధానంగా రానా పేరు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. రానా కథానాయకుడిగా తేజ ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి ఆచంట గోపీనాథ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం.
కాగా గతంలోనే 2017లో తేజ దర్శకత్వంలో రానా హీరోగా “నేనే రాజు నేనే మంత్రి” సినిమా రావడం జరిగింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దర్శకుడిగా తేజకి మరియు హీరోగా రానాకి మంచి ప్రయత్నించింది. మళ్లీ చాలాకాలం తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు తాజాగా న్యూస్ రావటం సంచలనంగా మారింది. పెళ్లయిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రానా మళ్ళీ ఇప్పుడు వరుస పెట్టి ప్రాజెక్టులతో స్పీడ్ పెంచనున్నట్లు సమాచారం.