NewsOrbit
సినిమా

అల్లూ అరవింద్ గొప్పతనం గురించి ఆ టాప్ డైరెక్టర్ చెబుతుంటే కంట్లో నీళ్ళు కారాల్సిందే !

హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి సినిమా లు తీసిన సాయి రాజేష్ ఫేస్ బుక్ లో అల్లూ అరవింద్ గురించి ఈ విధంగా పంచుకున్నాడు.


” ‘మా నాన్న గారు…The Most Misunderstood person in the world” అన్నాడు బన్నీ…
అల వైకుంటాపురం ఆడియో ఫంక్షన్ లో…

ఆ Most Misunderstood person గురించి చెప్పబోతున్నాను…

సరిగ్గా 15 రోజుల క్రితం…ఒక rare condition తో ఉన్న మా పాప కి మరో సర్జరీ అవసరం అన్నారు…కాళ్ళు చేతులు ఆడలేదు….రెండవ సర్జరీ వారం రోజుల వ్యవధిలో…..వయసు 9 ఏళ్ళు…

డాక్టర్లతో ఎవరైనా ఒక “పెద్ద మనిషి “..మాట్లాడితే కొద్దిగ జాగ్రత్తగా ఉంటుంది అనిపించి, Bunny Vas గారికి phone చేసి…situation ఇలా ఉంది అని చెప్పాను…
రాత్రి 9 అయింది అప్పటికే…
నేను అరవింద్ గారితో మాట్లాడతాను..నేను మాట్లాడిన 10 నిమిషాల తర్వాత నువ్వు చెయ్ అన్నారు..

అరవింద్ గారితో ఏం మాట్లాడగలను..అంత బిజీమెన్ కి ..ఇలా నా కష్టాలు చెప్పుకుంటూ …ఆయనకి వినే టైం ఉంటుందా…అసలు ఈ ఎమర్జెన్సీ situation లో ఆయన గుర్తు పెట్టుకొని ఫోన్ చెయ్యటం… నేను మళ్ళీ ఫాలో అప్ చెయ్యటానికి అయినా నా రేంజ్ సరిపోదు… still భయంతోనే ఫోన్ చేసాను…
ఒక్క నిముషంలో ..ఏం జరిగిందో హడావుడిగా చెప్పాను”ఫోన్ లో… అలా కాదు…మొత్తం నీట్ గా ఏం జరిగిందో చెప్పు…నేనొక డాక్టర్ ని conference లోకి తీసుకుంటా అని…ఈ కేస్ విషయంలో అవగాహన ఉన్న డాక్టర్ గారిని లైన్లోకి తీసుకొని.. మొత్తం విన్నారు…

తర్వాత హాస్పిటల్ లో సర్జరీ చేయబోయే డాక్టర్లతో ఒక అరగంట మాట్లాడారు…హాస్పిటల్ management తో మాట్లాడారు…పూర్తిగా సర్జరీ కి సంబంధించిన అన్ని విషయాలు ఆయన అర్థం చేసుకొని..నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్తూ ఒక మాట అన్నారు..

“Somehow…ఈ problem నుంచి బయటకి రా…and ఎంత ఖర్చవుద్దీ Financial గా అనే దిగులు పెట్టుకోకు… Iam there for you… ఆ భయం ని మైండ్ లోంచి తీసేయ్..U can depend on me” అన్నారు..
గుండెని ఎంతలా తాకింది అంటే…ఆయన దగ్గర నుంచి ఒక్క రూపాయి expect చెయ్యలేదు నేను…కనీసం అడగలేదు….నేనేం రాజమౌళి కాదు…తిరిగి కడతానన్న గ్యారంటీ లేదు…కానీ నేనిస్తా..భయపడకు అన్నారు…

“మా నాన్న పది రూపాయలు ఇవ్వాల్సిన చోట..
7 రూపాయిలే ఇస్తా అంటాడు…ఆ 7 రూపాయిలు ఇంటికెళ్లి ఇచ్చోస్తాడు” అనే బన్నీ మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి…ఇవ్వాల్సిన అవసరం లేని చోట…ఎదుటి మనిషి అవసరం కనిపెట్టి సహాయం చేస్తా అన్న మనిషి గురించి ఏం చెప్పాలి… నిజమే Misunderstood Person…

పక్క రోజు…మరికొన్ని కాల్స్, మరి కొన్ని conference కాల్స్…. సర్జరీ కాసేపట్లో అనగా…ఆయనే కాల్ చేసి…ఒక మాట అన్నారు
“నేను బిజీ గా ఉంటాను.. కాల్ చెయ్యొచో లేదో అని hesitate చెయ్యకు… నీకు ఏ డౌట్ వున్నా కాల్ చెయ్…అర్థరాత్రి కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తాను…ధైర్యంగా ఉండు” అన్నారు…అరవింద్ గారు మాతో కూడా మాట్లాడారు అని డాక్టర్లు చెప్పారు…
ఏదో చిన్న ధైర్యం.. సర్జరీ అయింది..మళ్ళీ నేను ఆయనకి ఫోన్ చెయ్యలేదు..

ఆ డబ్బు సహాయం నేను తీసుకోలేదు కానీ…ఒక చిన్న దర్శకుడి కోసం ఇన్ని గంటలు మాట్లాడటం… నాకు ధైర్యం చెప్పటం… డాక్టర్లతో నేను చాలా కావాల్సిన మనిషి అని మళ్ళీ మళ్ళీ చెప్పటం…ఆయన మాట్లాడి..తిరిగి నాకు update ఇవ్వటం…ఏం చెప్పాలి ఆయన గురించి… ఆయన పొజిషన్ కి ..ఆయన చేస్తున్న పని కి ..మాటలు రాలేదు..

ఇందాకే పాప రికవర్ అవుతోంది అని ఫోన్ చేసి చెప్పాను…సంతోషించారు…”urgent అనుకొని lift చేశా…వేరే ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నా , మళ్ళీ చేస్తా “అన్నారు ? నా టైం వేస్ట్ చెయ్యకు అన్నట్టు వినిపించింది… అరవింద్ గారంటే లెక్కల మనిషి…పని లేనప్పుడు దేనికెంత టైం పెట్టాలో తెలిసిన మనిషి అని అర్థం అయింది..

నాకోసం ఇంత చేసిన మనిషికి నేనేం ముఖ్యమైన మనిషిని కాదు…పట్టుమని పది సార్లు కూడా కలిసి ఉండను…కనీసం స్థాయిలో ఎక్కడా match కాను…
కానీ…సహాయం చేసే ఆ గుణమే వాళ్ళ కుటుంబాన్ని ఈ స్థాయిలో ఉంచింది అనుకుంటాను…నమ్ముకున్న ఎందరినో..ఎక్కడో తీసుకెళ్లి కూర్చోబెట్టారు… అందుకే అరవింద్ గారి చుట్టూ ఆయన్ని విపరీతంగా ప్రేమించే మనుషులే పని చేస్తుంటారు..

నేను ఋణపడి వుండాల్సిన మనిషి మీరు… ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే…
I owe you sir ..You are an inspiration ?
Thank you so much.. “

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N