హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి, సినీయర్ హీరో వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన సినిమా ఎఫ్2. సంక్రాంతి కానుకగా ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ వైపు దూసుకుపోతుంది. రిలీజైన అన్ని సెంటర్స్‌లోనూ హిట్ తెచ్చుకుంది. పక్కా ఫ్యామిలి ఎంటర్టైనర్గా తెరకెకక్కిన ఈసినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమాకు పోటీగా రిలీజ్ అయిన సినిమాలు డిలా పడడంతో ఎఫ్ 2కు బాగా కలిసోచ్చింది. దీంతో బాక్సాపీస్ వద్ద ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్ తెచ్చింది..ఇక వరుస ప్లాప్‌లతో ఢీలా పడిపోయిన దిల్‌రాజు ఎఫ్ 2తో భారీ సక్సెస్ అందుకున్నాడు.
ఈ చిత్రం రిలీజ్ అయి రెండు వారాలు అవుతున్న ఇంకా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. మిడియమ్ రేంజ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని రేంజ్లో భారీ హిట్‌గా నిలిచి కలెక్షన్ల మోత మోగిస్తోంది. వెంకీ, వరుణ్ కామెడికి యూ ఎస్ పీపుల్స్ కూడా పడిపడినవ్వుతున్నారు. బొమ్మ అదిపోయిందంటు సినిమాని రీపీటేడ్గా చూస్తున్నారు. రీపీట్ ఆడయన్స్ మళ్లీ మళ్లీ సినిమా చూస్తుండడంతో రోజు రోజుకు కలెక్షన్స్ పెరిగిపోతున్నాయి.
సినిమా బాగుడడంతో ఓవర్సీస్లో భారీ వసూళ్లలో సంచలనం సృష్టిస్తున్నది. ఇప్పటికే రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. దిల్‌రాజు ఇప్పటివరకు డిస్ట్రీబ్యూట్ చేసిని సినిమాల్లో హ్యాపీడేస్ ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. మళ్ళీ చాలా రోజుల తరువాత ఇప్పుడు ఎఫ్2 అత్యధిక వసూళ్లు రాబడుతుంది. ఈ ఇయర్ స్టార్టింగ్‌లోనే అమెరికాలో రెండు మిలియన్ మార్క్ దాటింది. బోమ్మ సూపర్ హిట్ కావడంతో ఇంకా మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు ట్రెండ్ వర్గాలు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!