Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా “మేజర్”. శశికిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోట బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దేశభక్తి నేపథ్యంలో.. లవ్ స్టోరీ యాడ్ చేసి సైనిక కుటుంబాల భావోద్రేకాలను రక్తికట్టించే క్రమంలో ముంబై 26/11 ఘటన మెయిన్ పాయింట్ గా తీసుకునే అద్భుతంగా తెరకెక్కించారు. చివరి అరగంట చాలా మంది కంటనీరు పెట్టుకోవడం జరిగింది. మహేష్ బాబు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా కోట్ల రూపాయలను కొల్లగొడుతుంది. సినిమా చూసిన ఆడియన్స్ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ కావడంతో.. “మేజర్” సినిమా యూనిట్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, హరీష్ శంకర్.. ఇంకా కొంతమంది ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఇప్పటికే మేజర్ మూవీ సినిమా యూనిట్ నీ పొగడటం జరిగింది. ఈ క్రమంలో తాజాగా మాజీ ఇండియన్ క్రికెటర్.. జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ వివిఎస్ లక్ష్మణ్ సైతం మేజర్ చిత్రం పై పొగడ్తల వర్షం కురిపించారు. మేజర్ గొప్ప చిత్రం అని ప్రశంసించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్టోరీస్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉందని తెలిపారు. అడవి శేషు నటనతో సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉందని అందరూ చూడవలసిన సినిమా అని వివిఎస్ లక్ష్మణ్ పొగడ్తలతో ముంచెత్తారు.
దీంతో సోషల్ మీడియాలో వి.వి.ఎస్.లక్ష్మణ్ పెట్టిన పోస్ట్ కి.. అడవి శేష్ రియాక్ట్ అయ్యి ఇది అద్భుతమైన మరపురాని సందర్భం. థాంక్యూ లక్ష్మణ్ సార్. మీ లాంటి జాతీయ గుర్తింపు కలిగిన వాళ్ళు అభినందించడం నిజంగా.. మాకు స్ఫూర్తిదాయకం అంటూ బదులిచ్చారు. వీవీఎస్ లక్ష్మణ్ మాత్రమే కాదు ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా “మేజర్” సినిమా యూనిట్ నీ హీరో అడవి శేష్ ని ప్రత్యేకంగా సత్కరించి.. మేజర్ మూవీ పై ప్రశంసల వర్షం కురిపించారు.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…