KGF 2: కన్నడ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్ 1` సైలెంట్‌గా వచ్చి దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టిచిందో ప్రత్యేకంగా వివరించిన చెప్పాల్సిన పని లేదు. అయితే దీనికి కొనసాగింపుగా రూపుదిద్దుకున్న `కేజీఎఫ్ చాప్టర్ 2` ఇటీవలె విడుదలై.. అంతకుమించి విజయాన్ని నమోదు చేసింది.
హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా చేయగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. రవీనా టాండన్, రావు రమేష్ ముఖ్య పాత్రలను పోషించారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా లెవల్లో అట్టంగా రిలీజ్ అయిన కేజీఎఫ్ 2.. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి భారీ కలెక్షన్స్‌తో నయా రికార్డులను సృష్టించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైం.. మార్చి 16 నుంచి ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో అందుబాటులోకి తెచ్చింది. అంటే ఈ సినిమాను చూడాలంటే సబ్స్క్రైబర్లు అదనంగా రూ.199 చల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. థియేటర్లోనే కాకుండా ఓటీటీలోనూ సినిమాకు డబ్బు చల్లించాలా, ఎంత అన్యాయం అంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు.
అయితే తాజాగా అమెజాన్ వారు యశ్ అభిమానులు మరియు సినీ ప్రియులకు గుడ్ న్యూస్ తెలిపింది. అదేంటంటే.. కేజీయఫ్ చిత్రానికి ‘పే పర్ వ్యూ’ పద్దతిని తొలిగించనున్నారు. అవును, జూన్ 3వ తేదీ నుంచి సబ్స్క్రైబర్లు ఈ చిత్రాన్ని ఫ్రీ చూసే వెసులు బాటును అమెజాన్ వారు కల్పించబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
Join Rocky on his journey to rule the world!! 🔥#KGF2onPrime, streaming from June 3 pic.twitter.com/m2dAaqxomE
— amazon prime video IN (@PrimeVideoIN) May 31, 2022