అమ్మ అని పిలిపించుకోవడం కోసం ఆడవాళ్ళు పడే తపన అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆడవాళ్లకు మాతృత్వం అనేది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసిన దగ్గర నుండి ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.లేదంటే తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హానికరం.అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు అన్ని పోషకాలతో కూడిన ఆహారాన్ని తినాలి.ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు బెల్లం తినాలి. ఎందుకంటే బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. ఫలితంగా రక్త హీనత లోపం అనేది ఉండదు.ఇవే కాకుండా బెల్లం తినడం వలన ఇంకా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బెల్లం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
బెల్లం హార్మోన్ల అసమతుల్యతను క్రమబద్దికరిస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో.రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది రక్త కణాల పెరుగుదలలో ఉపయోగపడుతుంది.గర్భిణీలు చక్కెర వాడకాన్ని తగ్గించి బెల్లం వాడితే మంచిది.బెల్లంలో మెగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు దృడంగా మారతాయి.గర్భధారణ సమయంలో బెల్లం తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు విసర్జించబడతాయి.
గర్భిణీ స్త్రీలు బెల్లం తినవచ్చా..?
గర్భధారణ సమయంలో స్త్రీలు ఏక్కువగా మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కావున బెల్లం తింటే అన్ని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. బెల్లంలో పొటాషియం, సోడియం మితంగా ఉంటాయి కాబట్టి ఇవి ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది.ఇన్ని ఉపయోగాలు ఉన్న బెల్లంను తినడం వలన తల్లికి,కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఇద్దరికి మంచిది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!