ఇలియానా అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఆమె జగనమే. కుర్రకారుని తన నడుమొంపు సొగసులతో అలా కట్టిపడేసింది మరి. ఈమె తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. రీసెంట్గా రవితేజ సరసన `అమర్ అక్బర్ ఆంటోని` చిత్రంలో నటించింది. అయితే త్వరలోనే నితిన్ సినిమాలో నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లో కెళ్తే.. నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు. అందులో ఇద్దరు ఇప్పటికే ఖరారయ్యారు. కాగా.. మూడో హీరోయిన్గా ఇలియానా నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. ఇదే కనుక నిజమైతే నితిన్‌తో ఇలియానా పదేళ్ల తర్వాత నటించినట్టే. ఇది వరకు వీరిద్దరూ కలిసి `రెచ్చిపో` అనే సినిమాలో నటించారు.
previous post
next post
Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు... షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!