Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్లో హిమతో జ్వాల తను డాక్టర్ సాబ్ ను ప్రేమిస్తున్న విషయం చెబుతుంది. అలాగే గత ఎపిసోడ్ లో శోభ అనే కొత్త క్యారెక్టర్ ను కూడా డైరెక్టర్ పరిచయం చేయడం తెలిసిన సంగతే. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరగనుందో ముందుగా తెలుసుకుందాం. హిమ, జ్వల ఇద్దరూ ఒక చోట నిలబడి నిరుపమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సీన్ ఈరోజు కూడా కంటిన్యూ అయ్యింది.జ్వల ‘డాక్టర్ సాబ్ నాకు ఐ లవ్యూ కూడా చెప్పాడు..’ అంటూ నిరూపమ్ తాగి ఉన్నరోజు జరిగిన సీన్ ను హిమకు చెబుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జ్వాల ప్రేమను నిరూపమ్ కు చెప్పొద్దు అని హిమ ఎందుకు అంది..?
ఇక హిమ మనసులో.. ‘అది నాకు చెప్పాడు సౌర్యా.. నీకు కాదు’ అంటూ మనసులోనే బాధపడుతుంది.ఏయ్ తింగరి నేను‘నేను కూడా తిరిగి నా మనసులో మాటను డాక్టర్ సాబ్ కు చెప్పేస్తాను అంటుంది.ఇక హిమ టెన్షన్ గా వద్దు అప్పుడే వద్దు జ్వాల.నీకు ఎప్పుడు చెప్పాలో నేను చెబుతాను.అప్పటి దాకా నువ్వు ఏమి చెప్పొద్దు అంటుంది. కొన్ని సార్లు తొందరపడటం మంచిది కాదు జ్వాల.మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది.. సరేనా’ అని మాట కూడా ఇస్తుంది. సరే అని అంటుంది జ్వాల.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
శోభను సౌందర్యకు పెద్ద కోడలుగా పరిచయం చేసిన స్వప్న:
ఇక సీన్ కట్ చేస్తే ఆనందరావు ఊరి నుంచి రాగానే సౌందర్య సంతోషంగా సౌర్య కాల్ చేసిన విషయం. చెబుతుంది. అనందరావు కూడా సంతోషపడతాడు తను త్వరలో మన దగ్గరకు రాబోతుంది అని అంటాడుఆనందరావు. ఇంతలో స్వప్న స్వీట్స్ పట్టుకొచ్చి ‘హాయ్ మమ్మీ ఇంకేంటి సంగతులు.. స్వీట్స్ తీసుకోండి’ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది.విషయం ఏమిటి అని సౌందర్య అడగగా శోభా..’ అని పిలుస్తుంది స్వప్న. అప్పుడు హిమ, సౌర్యలతో గొడవ పడిన డాక్టర్ నవ్వుతూ ఎంట్రీ ఇస్తుంది.ఇక స్వప్న..సౌందర్య, ఆనందరావులకు శోభా దేవి అని ఆమె డాక్టర్ అని పరిచయం చేస్తుంది. అంతేకాకుండా శోభ నా ఇంటికి కాబోయే పెద్ద కోడలు అని షాక్ ఇస్తుంది.ఆ మాట విని సౌందర్య, ఆనందరావులు షాక్ అయిపోతారు.ఇక స్వప్న మాత్రం అమ్మా శోభా పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకో.. నీకు వరసకు నాన్నమ్మా తాతయ్యలు అవుతారులే అంటుంది స్వప్న. వెంటనే సౌందర్య, ఆనందరావుల కాళ్లకు దన్నం పెడుతుంది శోభా.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
స్వప్న, శోభలకు సవాల్ విసిరిన సౌందర్య:
‘మమ్మీ ఎవ్వరితోనైనా నిరుపమ్‌కి రాఖీనే కట్టిస్తా అన్నావ్ కదా కానీ శోభాతో నా కొడుకు నిరుపమ్‌తో తాళి కట్టించుకుని తీరుతుంది అని అంటుంది. సర్లే గాని నీ మనవరాలు ఎక్కడా?అని వెటకారంగా మాట్లాడుతుంది.మమ్మీ నీ నిశ్చితార్థం పాపం ఫెయిల్ అయ్యింది.. కానీ నా ప్లానింగ్ సూపర్ సక్సెస్ అవుతుంది చూడు అంటుంది స్వప్న. అప్పుడే సౌందర్య కాస్త నవ్వుతూ శోభ దగ్గరకు వెళ్లి.. ‘శోభా దేవి.. చాలా చక్కగా ఉన్నావ్. ఏంటమ్మా నీ చెంప ఇలా కందిపోయింది?’ అంటుంది సౌందర్య.మేకప్ మమ్మీ..మేకప్‌లో అదోభాగం’ అంటుంది స్వప్న. ‘ఇది మేకప్‌లా లేదే?ఎవరో నా మనవరాలు వయసు ఉన్న అమ్మాయి నీ చెంప పగలకొట్టినట్లు అనిపిస్తుంది అంటుంది. వెంటనే సౌర్య కొట్టిన సీన్ గుర్తు చేసుకుంటుంది శోభ. మమ్మీ ఆపుతావా అంటుంది. ఇక సౌందర్య రెచ్చిపోయి నీ ఆశలన్నీ అడియాశలే అవుతాయి స్వప్నా.. నువ్వు ఎన్ని వేషాలు వేసినా నీ పెద్ద కోడలు మాత్రం నా మనవరాలే అవుతుంది అంటుంది.మమ్మీ నీ వెటకారాలు ఆపు.. నా పెద్ద కోడలు ఈ శోభానే. ఎవరు ఆపుతారో..? ఎలా ఆపుతారో నేను చూస్తాను అని శోభాతో కలిసి వెళ్ళిబోతుంది.
నిరూపమ్ ను చూస్తూ ఊహల్లో విహారిస్తున్న జ్వాల:
సీన్ కట్ చేస్తే జ్వాల నిరుపమ్‌ని వెనుకే కూర్చోబెట్టుకుని ఆటో నడుపుతూ డాక్టర్ సాబ్ ను. చూసుకుంటూ తెగ మురిసిపోతుంది.కానీ.నిరుపమ్ మాత్రం చాలా దిగులుగా ఉంటాడు. ఇక ‘ఎక్కడికి వెళ్లాలి డాక్టర్ సాబ్’ అంటే.. ‘ప్రశాంతంగా ఉండే చోటకి ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటాడు. దాంతో జ్వాల నిరుపమ్ దిగులుగా ఉండటం గమనించి.. ఆటో ఆపి.. నిరుపమ్‌ని ముందు కూర్చోబెట్టి ఆటో నడిపిస్తుంది. దాంతో కాసేపటికి నిరుపమ్ ముఖంలో సంతోషం వస్తుంది.మరో వైపు హిమ..నిరూపమ్ సౌర్యతో కలిసి వెళ్లాడు. ఇప్పుడు మా పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం సౌర్యతో చెబితే నా పరిస్థితి ఏంటీ?’ అంటూ ఆలోచిస్తుంది.ఎదురుగా ఓ పెషెంట్‌ని పెట్టుకుని.. ఆమెకు వైద్యం చేస్తూనే ఆలోచిస్తుంది హిమ.
డాక్టర్ గా శోభ ఎంట్రీ… షాక్ లో హిమ :
సరిగ్గా అప్పుడే శోభా ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఆమెను చూసి ఈమేంటి ఇక్కడికి వచ్చింది అని ఆలోచించే లోపు.. హిమ ముందు ఉన్న పేషెంట్‌కి మందులు రాసి ఇవి వాడు అంటూ పంపించేయబోతుంది. ఆ స్లిప్ లాక్కుని నువ్వెలా రాస్తావ్ అంటుంది. అన్నీ కరెక్ట్‌గానే రాశానా’అంటుంది శోభ పొగరుగా..ఓహో.. నువ్వు డాక్టరవా?’ అనుకుంటుంది హిమ మనసులో శోభాని చూసి.నేను డాక్టర్ శోభా దేవి ఎండీ.. గైనకాలజిస్ట్.. ఫుల్ మూన్ హాస్పెటల్..’ అంటూ తనని పరిచయం చేసుకుంటుంది శోభ. నేను డాక్టర్నే అని ఊహించలేదుగా.. నేను ఎందుకు వచ్చానని ఆలోచిస్తున్నావా? మా ఆంటీ వచ్చాక అంతా నీకే తెలుస్తుంది..’ అనేలోపు స్వప్న ఎంట్రీ ఇస్తుంది.అత్తను చూసి హిమ మరింత షాక్ అవుతుంది.చూడు శోభా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది తనే..’ అంటుంది శోభతో. సరేగాని నా కొడుకు ‘నిరుపమ్ ఎక్కడా అని స్పప్న రెట్టించి మరీ హిమని అడుగుతుంది. ఆమ్మో ఇప్పుడు బావ జ్వాల దగ్గర ఉన్నాడని చెప్తే అత్తయ్య తిడుతుందేమో.. ఇప్పుడు ఏం చెప్పాలి’ అనుకుంటూ ఉండడంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!