NewsOrbit
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TDP Janasena: టీడీపీకి డేంజర్ సిగ్నల్స్..! బీజేపీ సెన్సేషనల్ ప్లాన్ – జగన్..!?

TDP Janasena:  ఏపీ రాజకీయాల్లో జనసేన -బీజేపీ, టీడీపీ పొత్తు చాలా సందేహాలకు తావు ఇస్తోంది.ఈ పొత్తుల వ్యవహారం ఇంకా ప్రాధమిక దశలోనే ఉంది. ఎవరికి ఎన్ని సీట్లు అనే దానిపై ఇంకా మాటల దశకు కూడా రాలేదు. మాటలు ప్రారంభం కాలేదు. కనీసం పొత్తులు పెట్టుకోవాలా వద్దా అనేది కూడా ఇంకా డైరెక్ట్ గా కలిసి మాట్లాడుకోలేదు. పరోక్షంగా అటు పవన్ కళ్యాణ్ గానీ ఇటు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. పొత్తుల విషయం పై అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు కు ఒక క్లారిటీ ఉంది కానీ బీజేపీ సోము వీర్రాజు కు, జనసేన లో నాగబాబు, ఆ పార్టీ లో సోషల్ మీడియాకు, టీడీపీ లో సోషల్ మీడియా లో వారికి క్లారిటీ లేదు. క్లారిటీ లేక రకరకాల ఊహగానాలు, రకరకాల సందేహాలు, రకరకాల ప్రచారాలు చేస్తున్నారు..

TDP Janasena Alliance BJP Politics
TDP Janasena Alliance BJP Politics

TDP Janasena: సోషల్ మీడియా లో రకరకాల కామెంట్స్

జనసేన 76 స్థానాల్లో గెలిచేస్తుంది అని ఇటీవల ఒ సర్వే వచ్చింది. టీడీపీ లో మరో ప్రచారం చేస్తుంది. జనసేన పది స్థానాల్లో కూడా గెలిచే పరిస్థితి లేదంటూ. పొత్తు లేకపోతే పవన్ కళ్యాణ్ గెలుపు కూడా అనుమానమే అంటూ ప్రచారం చేస్తుంది టీడీపీ సోషల్ మీడియా. . .జనసేన తగ్గట్లు ఆ పార్టీ, టీడీపీ తగ్గట్లు ఆ పార్టీ ప్రచారాలు చేసుకొంటోంది. ఈ పుకార్లు, ఊహగానాలు పక్కన పెడితే… ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తల పెట్టే అవకాశం ఉందా..? టీడీపీ మైండ్ గేమ్ ఆడే అవకాశం ఉందా..? జనసేన -టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఒ క్లారిటీ ప్రకారం వెళ్తారు. కానీ బీజేపీ కి ఓట్లు లేవు, సీట్లు లేవు. సరైన బలం లేదు.2019లోనే వాళ్లకు ఒక శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 0.5శాతం కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే…ఏపీ కి బీజేపీ చేసింది ఏమిలేదు. 2019 కి ముందు మంగళగిరి కి ఎయిమ్స్, ఇతర కేంద్ర సంస్థ లు ఇచ్చింది. అప్పుడే ఒక శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఏపీ కి కేంద్రం లోని బీజేపీ లాభం చేయక పోగా నష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ, రాజధాని విషయంలో డబుల్ గేమ్ ఆడటం, నిధులు మంజూరు, పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం లాంటివి చేసింది. ఈ కారణాల వల్ల ఏపీలోని చాలా వర్గాల్లో బీజేపీ పై కోపం ఉంది. కాబట్టి బీజేపీ కి ఓటింగ్ తగ్గుతుంది కానీ పెరిగే అవకాశం లేదు. రాష్ట్రంలో బీజేపీ సొంత బలంతో ఒక్క సిటులో కూడా డిపాజిట్ తెచ్చుకునే పరిస్థితి లేదు కానీ..బీజేపీ అనేది ఒక మహా శక్తి. వాళ్ళ చేతిలో వ్యవస్థ లు ఉన్నాయి. అలానే కార్పొరేట్ శక్తులు కూడా బీజేపీ చేతిలోనే ఉన్నాయి. అన్ని వ్యవస్థ లు బీజేపీ వద్ద ఉన్నందువల్ల ప్రజా బలం ఉన్న ఏ పార్టీ అయినా వాళ్ళ వద్ద చేతులు కట్టుకొని నిల్చొవాల్సిందే. .

TDP Janasena Alliance BJP Politics
TDP Janasena Alliance BJP Politics

బీజేపీ ఎంటర్ అయితేనే… టీడీపీకి

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జనసేన -టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు కానీ వీళ్ళ మధ్య బీజేపీ చేరితే వీళ్ళ ను ఆ పార్టీ శసిస్తుంది. బీజేపీ మాట చంద్రబాబు వినరు కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారా శాసించే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కు కన్నింగ్ రాజకీయాలు తెలియవు. క్లీన్ గా ఉంటారు. కానీ ఎప్పుడైతే బీజేపీ పవన్ కళ్యాణ్ ను నడిపిస్తుందో ఆయన చంద్రబాబు మాట వినే పరిస్థితి ఉండదు. చంద్రబాబు నే శాశించాలి అని అనుకుంటారు. బీజేపీ కి ఎటువంటి దురుద్దేశాలు లేకుండా పొత్తులు పెట్టుంటే ఇబ్బంది ఉండదు. వైసీపీ అధికారం లోకి వచ్చినా ఫరవాలేదు రాష్ట్రం లో బీజేపీ -జనసేన సెకండ్ ప్లేస్ లోకి రావాలి అని భావిస్తేనే టీడీపీ కి నష్టం జరుగుతుంది. గడచిన మూడేళ్ళ లో బీజేపీ అదే ప్రయత్నం చేసింది. కానీ అది వర్క్ ఔట్ కాలేదు. రాష్ట్రంలో వైసీపీ కి బీజేపీ జనసేన ప్రత్యామ్నాయం అవ్వాలని టీడీపీ ని మూడవ స్థానానికి పంపాలి అని బీజేపీ భావించింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు తీసుకోని ఓడిపోయి టీడీపీ ని అధికారంలోకి రాకుండా చేస్తే భవిష్యత్ లో టీడీపీ క్యాడర్ బీజేపీ జనసేన లో చేరిక వల్ల రెండవ స్థానానికి వచ్చే ప్రయత్నం చేయవచ్చు. అందుకే వీళ్ళు ఎక్కువ సీట్లు అడుగు తారేమో అన్న భయం టీడీపీ లో ఉంది. మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాకూడదు. టీడీపీ జనసేన పవర్ లోకి రావాలి అని పవన్ కళ్యాణ్ కు ఉంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఫరవాలేదు కానీ మా మాట వినేవాళ్ళు సీఎంగా ఉండాలి అని బీజేపీ భావిస్తోంది. చంద్రబాబు అయితే మాట వినడు, జగన్ అయితే మాట వింటాడు అని కూడా వాళ్లకు ఉంది. పొత్తులో బీజేపీ ఎంటర్ అయితే టీడీపీకి డేంజర్ బెల్స్ మొగినట్లే అవుతుందా కాదా మీరే గెస్ చేయండి.

TDP Janasena Alliance BJP Politics
TDP Janasena Alliance BJP Politics

author avatar
Srinivas Manem

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju