సినిమా

Keerti Suresh: అందాలు ఆరబోస్తున్న కీర్తి సురేష్..!?

Share

Keerti Suresh:ఇప్పటి వరకు అభినయంపైనే దృష్టిసారించిన కీర్తి సురేష్ ఇటీవల కాలంలో తన హద్దులు చెరిపేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లామర్ డోస్ పెంచేస్తూ, కుర్రకారు దృష్టిని ఆకర్షిస్తోంది. అలనాటి నటి సావిత్రి జీవిత కథతో రూపొందిన ‘మహానటి’ సినిమాకు గానూ జాతీయ అవార్డును అందుకుంది. అయితే కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఆమె కూడా పడరాని పాట్లే పడుతోంది. ఇక మహేష్ బాబు సరసన తొలిసారిగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న థియేటర్లలో విడుదలైంది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ ఇంతకు ముందు సినిమాల కంటే హాట్ హాట్‌గా కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేవలం నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలనే కీర్తి సురేష్ ఎంచుకుంటూ వస్తోంది. సర్కారు వారి పాటలో వెండి చీరలో కూడా కాస్త గ్లామర్‌గా దర్శనమిచ్చింది. తొలి సారి తన నడుము అందాలు కనిపించేలా చేసింది. సినిమా మొత్తం చాలా అందంగా కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఆమె చేపట్టిన ఓ ఫొటో షూట్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. బటన్స్ ఏ మాత్రం లేని డిజైనర్ జాకెట్‌లో అందాలు కనిపించేలా ఫొటో షూట్ చేసింది. మతిపోయే ఫోజులు పెట్టి, ఎంతో చక్కగా ఫొటోలు దిగింది. చూసే వారి మతులు పోగొట్టే ఆ ఫొటోలను ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆమె ఇప్పటి వరకు గ్లామర్ పట్ల నిశ్చితాభిప్రాయం ఉండేది. తాను గ్లామర్ పాత్రలకు దూరం అంటూ ఉండేదని సినీ వర్గాల్లో ప్రచారం సాగేది. అయితే ఇటీవల కాలంలో ఆమె వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతోందని తెలుస్తోంది. స్కిన్ షో చేయకపోయినా, ఇంతకు ముందు కంటే గ్లామరస్‌గా కనిపించాలనే నిర్ణయానికొచ్చినట్లు పలు ఇంటర్వ్యూలలో ఆమె చెప్పకనే చెప్పింది. ఆ వ్యాఖ్యల మర్మం తాజా ఫొటో షూట్‌లలో కనిపిస్తుందనేది విశ్లేషకుల వాదన. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అందాలు ఒలికించేలా దిగిన ఫొటోలు మాత్రం చూసే వారి మతిపోగొడుతున్నాయని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Share

Related posts

సోష‌ల్ మీడియా అంత కాజల్ చుట్టూనే.. ఎందుకో తెలుసా?

Teja

Samantha RuthPrabhu Beautiful Looks

Gallery Desk

Prabash: వ‌ర‌ల్డ్‌లోనే ఏ హీరోకు లేని లైన‌ప్.. నెక్ట్స్ ఐదేళ్లలో ప్ర‌భాస్ చేయ‌బోయే సినిమాలు ఇవే …!

Ram