సినిమా

Aacharya: “ఆచార్య” లో కాజల్ క్యారెక్టర్ పై కొరటాల క్లారిటీ..!!

Share

Aacharya: కొరటాల శివ దర్శకత్వంలో  చిరంజీవి, చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అవుతున్న ప్రోమోలు ట్రైలర్ లలో ఎక్కడా కూడా హీరోయిన్ కాజల్ బొమ్మ కనబడలేదు. పైగా ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకలో వేదికపై ఎవరూ కూడా కాజల్ ప్రస్తావన తీసుకు రాలేదు. పూజా హెగ్డే గురించే అందరూ మాట్లాడుతూ వచ్చారు. కానీ సినిమా ప్రారంభించిన టైంలో చిరంజీవి సరసన హీరోయిన్ పాత్రలో కాజల్ నటిస్తున్నట్లు ప్రకటించారు. అయితే “ఆచార్య”కి  సంబంధించి రిలీజ్ అవుతున్న వీడియోలు… ట్రైలర్ లలో ఎక్కడ కూడా కాజల్ ప్రస్తావన లేకపోవడంతో… అసలు సినిమాలో కాజల్ ఉందా..? లేదా..? అనే డిస్కషన్ లు సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది. Kajal's Role Removed From Chiru's Acharya? - Movie Newsఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కొరటాల శివ.. “ఆచార్య”లో కాజల్ క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చారు. “ఆచార్య” సినిమా ప్రారంభంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ అనుకున్న సంగతి తెలిసిందే. ధర్మస్థలి లో ఓ అమ్మాయి పాత్రకు కాజల్ అగర్వాల్ నీ తీసుకోవడం జరిగింది. నాలుగు రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. మధ్యలో కరోనా రావడంతో… షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఇటువంటి తరుణంలో హీరో పాత్ర నక్సలిజం సిద్ధాంతం తో ముడిపడి ఉండటంతో.. హీరోయిన్ ఉంటే బాగుంటుందా లేదా అనిపించింది. Acharya Event: No One Mentioned About Kajal - Movie Newsకావాలని హీరోయిన్ క్యారెక్టర్ పెడితే బాగోదు అని అనిపించింది. పైగా ఆ పాత్రకు ఎక్కడా కూడా పాటలు కూడా లేవు… ముగింపు కూడా సరిగ్గా ఉండదు. అటువంటి క్యారెక్టర్ కి స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్న కాజల్ తో చేయిస్తే బాగోదు అని అనిపించింది. ఇదే విషయాన్ని చిరంజీవి గారికి చెబితే కథకి ఏది అవసరమైతే అది చెయ్. ఇదే విషయాన్ని కాజల్ అగర్వాల్ కి అర్థమయ్యేలా చెప్పాను. ఆమె అర్ధం చేసుకుంది. ఆ తర్వాత అందరిని మిస్ అవుతున్నాను తప్పకుండా భవిష్యత్తులో కలిసి.. సినిమా చేద్దామని అన్నారు. ఆ విధంగా కాజల్ క్యారెక్టర్ ఆచార్య సినిమా నుండి తొలగించాం అని కొరటాల క్లారిటీ ఇచ్చారు.


Share

Related posts

న‌ట‌న‌కే ప‌రిమిత‌మ‌వుతానంటున్న కాజ‌ల్‌

Siva Prasad

Pooja Hegde: ఐటం సాంగ్ లో బుట్టబొమ్మ.. భారీ పారితోషికం డిమాండ్..!!

Ram

Aditi Rao Hydari Pink Saree Gallerys

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar