Varun Tej-Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన తాజా చిత్రం `గని`. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించగా.. ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలను పోషించారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించారు.
గత ఏడాదే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. వాయిదా పడుతూ పడుతూ చివరాఖరకు ఏప్రిల్ 8న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచగా.. విజృతమైన ప్రమోషన్స్‌తో మేకర్స్ మరింత హైప్ క్రియేట్ చేశారు.
ఇక రిలీజ్‌కు మరికొన్ని గంటల సమయమే ఉండగా.. వరుణ్ తేజ్‌కు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపింది. `వరుణ్.. ఈ పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫర్ట్ పెట్టావని తెలుసు. నీతో పాటు నీ టీం చేసిన హార్డ్ వర్క్‌కి తగిన ప్రతిఫలం దక్కాలని ప్రార్థిస్తున్నా` అంటూ ట్వీట్ చేసింది.
అయితే `మిస్టర్`, `అంతరిక్షం` చిత్రాల్లో కలిసి నటించిన వరుణ్, లావణ్యలు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో రకరకాల వార్తలు వచ్చాయి. లావణ్య ఈ వార్తలపై పరోక్షంగా స్పందించి. కానీ, నేరుగా ఇంతవరకు వరుణ్ తేజ్ కానీ, లావణ్య కానీ ఖండించలేదు. ఇక తాజాగా వరుణ్‌కు లావణ్య స్పెషల్‌గా విష్ చేయడంతో.. మళ్లీ వీరిద్దరిపై లవ్ రూమర్లు ఊపందుకున్నాయి. మరి ఈసారి అయినా… ఈ రూమర్స్ కు పులి స్టాప్ పెడతారో లేదో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!