సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడు సీనియర్ నరేశ్ `మా` నెలకొన్న వివాదాలపై స్పందించారు. `మా` రాజకీయ పార్టీ కాదని, సేవా సంస్థ అని ఈ సందర్భంగా తెలిపారు నరేశ్. ఆయన ఇంకా మాట్లాడుతూ “`మా`లో ఆధిపత్య పోరు ఉన్న మాట వాస్తవమే కానీ.. నేను సభ్యుల ఓట్లతో గెలిచాను. నన్ను ఎవరూ బయటకు పంపలేరు. నేను ఎన్నికైనప్పుడే ఓ టర్మ్ మాత్రమే పనిచేస్తానని చెప్పాను. ఇప్పటికే ఓ సంవత్సరం పూర్తయ్యింది. మరో సంవత్సరం మాత్రమే ఉంది. లేదు నువ్వు తప్పుకోవాలని సభ్యులందరూ సూచిస్తే నేను సిద్ధమే. నేను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆరు నెలల్లో చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశాను. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కొన్ని చేయలేకపోయాను. చిరంజీవి, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి వారిని కలుపుకుని పోతున్నాను. నేను అజాత శత్రువుని“ అన్ని అన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!