నేషనల్ అవార్డ్ విన్నర్, మల్టీ టాలెంట్ హీరో ధనుష్‌కు సౌత్‌లో మంచి క్రేజ్ ఉంది. న్యాచురల్ యాక్టింగ్‌తో అదరగోడుతూ మాస్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేస్తున్న ఈ మాస్ హీరో నటించిన లెటేస్ట్ ఫిల్మ్ మారీ 2. మారీ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో ధనుష్ లోకల్ రౌడీగా నటించాడు. ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్నా ఇందులోని సాంగ్స్ మాత్రం ఆడియన్స్ బాగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా రౌడీ బేబి సాంగ్ మాత్రం భాషతో సంబంధం లేకుండా అందరికీ తెగ నచ్చేసింది.
దనుష్ పాడిని ఈ రౌడీ బేబీ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రభుదేవా డాన్స్ కంపోజ్ ఈ పాటకు సాయిపల్లివి, ధనుష్ డాన్స్‌తో దుమ్ము ధులిపారు. ముఖ్యంగా సాయిపల్లవి తనలోని డాన్స్ స్కిల్స్ మొత్తం భయటపెట్టింది. స్వతహాగానే మంచి డాన్సర్ అయిన సాయి పల్లవి, ఈ పాటలో కూడా తన డాన్స్‌తో ధనుష్ నే డామినేట్ చేసింది. ఇక లిరిక్ కి తగ్గట్టు మంచి సెట్ వేసి చేసిన పిక్చరైజైషన్ కూడా బాగుడడంతో ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ట్రెడింగ్లో ఉంది. ఇక యూట్యూబ్‌లో అయితే రౌడీ బేబీ పాట 100 మిలియన్స్ వ్యూవ్స్ దాటి 110 మిలియన్ వైపు వెళ్తోంది.
సినిమా హిట్ కాకపోయినా ధనుష్ తన పాటతో మ్యాజిక్ చేయడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ‘త్రీ’ సినిమా ఆశించిన ఫలితం రాబట్టలేకపోయినా కూడా అందులోని ‘వై దిస్ కొలవెరి’ సాంగ్ ఇంటర్నెట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రౌడీ బేబీ విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతోంది. ఈ పాటల జోష్ కి తగ్గట్లు సినిమా కూడా మంచి రిజల్ట్ రాబట్టి ఉంటే బాగుండేది
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!