Mahesh Babu: గత కొన్ని సంవత్సరాల నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాక హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కూడా మహేష్ నమోదు చేసుకోవడం జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను” .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “మహర్షి”.. అనిల్ రావిపూడి దర్శకత్వం లో గతయేడాది “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో వరుస విజయాలు మహేష్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ప్రస్తుతం “గీతా గోవిందం” డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ తో పాటు డిఫరెంట్ మేక్ఓవర్ కలిగిన డేట్ అఫ్ ఉండటంతో సినిమా ఏ విధంగా ఉంటుందో గత ఏడాది నుండి అభిమానులు డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రతి ఏడాది తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు.. మహేష్ తాను చేయబోయే సినిమాకు సంబంధించి వీడియో గాని ఫొటోస్ గాని రిలీజ్ చేయటం సెంటిమెంట్. దీనిలో భాగంగానే గత ఏడాది పరశురాం తో చేయబోయే సినిమా “సర్కారు వారి పాట” సినిమా అంటూ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
అయితే ఈ ఏడాది మరో రెండు వారాలలో పుట్టినరోజు వస్తున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయిందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇతర హీరోల సినిమాల టిజర్లు అనేక రికార్డులు సృష్టిస్తూ ఉండటంతో తాజా వార్తతో మహేష్ అభిమానులు రికార్డులు క్రియేట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!