సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో “SSMB 28” అనే వర్కింగ్ టైటిల్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అధికారికంగా ప్రకటించి దాదాపు ఏడాదికి పైగానే అయింది. గత ఏడాది మహేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో ఇటీవల ఆగస్టు నుండి స్టార్ట్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. కేవలం 100 రోజులు మాత్రమే కాల్ షీట్స్ ఇవ్వడం జరిగిందట.
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ .. ఇలా ప్రతి నెలలో 20 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొననున్నారట. ఈ ఏడాది డిసెంబర్ మాసంకి సినిమాని కంప్లీట్ చేసే తరహాలో మహేష్… త్రివిక్రమ్ పక్క షెడ్యూల్ తో.. సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “అతడు”, “ఖలేజా” రెండు కూడా ఎంతగానో అలరించడంతో వస్తున్న ఈ మూడో ప్రాజెక్ట్ “SSMB 28” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
త్రివిక్రం “అలా వైకుంఠపురం లో” సూపర్ హిట్ తర్వాత.. మహేష్ “సర్కారు వారి పాట” విజయం తర్వాత.. చేస్తూ ఉండటంతో ఈ సినిమా ఎటువంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఏది ఏమైనా నెక్స్ట్ రాజమౌళి ప్రాజెక్టు స్టార్ట్ అవ్వకముందే.. ఈ ఏడాది చివరిలోనే త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసే ఆలోచనలో మహేష్ ఉన్నారు. రాజమౌళి సినిమా అంటే దాదాపు సంవత్సరాలు పట్టే టైం.. కావడంతో మహేష్ కేవలం వంద రోజులు కాల్ షిట్స్ లో త్రివిక్రమ్ సినిమా ముగించాలని డిసైడ్ అయ్యారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!