Categories: సినిమా

Chiranjeevi: విదేశీ యాత్ర నుండి స్వదేశానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి..!!

Share

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గత కొన్నాళ్లుగా తీవ్రంగా సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్ రావడంతో సినీ కార్మికులకు నిత్యావసరాల సరుకులతో పాటు మరిన్ని సహాయ సహకార కార్యక్రమాలు చిరంజీవి దగ్గరుండి చేయించారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్ ధర విషయంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల తనదైన శైలిలో స్పందించి.. ప్రభుత్వాల నుండి సానుకూలమైన నిర్ణయాలు రావడంలో కీలక పాత్ర పోషించారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా మందిని కరోనా సమయంలో చిరంజీవి ఆదుకుని తర్వాత .. సొంత బ్యానర్ లో కొరటాల శివ దర్శకత్వంలో ఒప్పుకున్న “ఆచార్య” సినిమా షూటింగ్ లో బిజీ కావడం తెలిసిందే.

అయితే ఈ సినిమా ఏప్రిల్ నెల 29వ తారీకు విడుదల అయ్యి.. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇదంతా పక్కన పెడితే దాదాపు రెండు సంవత్సరాలపాటు ఫుల్ బిజీగా ఉన్నా చిరంజీవి “ఆచార్య” విడుదలైన తర్వాత భార్య సురేఖ తో విదేశీ యాత్ర చేపట్టడం తెలిసిందే. గత నెల మూడవ తారీకున సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లిన చిరంజీవి దాదాపు నెల రోజుల పాటు హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేయడం జరిగింది. తాజాగా నిన్న జూన్ మూడవ తారీఖు నాడు హైదరాబాద్ కి చేరుకున్నారు. దీంతో ఇప్పుడు చిరంజీవి ఒప్పుకున్న సినిమా షూటింగ్ లను కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

దీనిలో భాగంగా మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న “గాడ్ ఫాదర్” సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో చేయాల్సిన ఒక సాంగ్ షూట్ ముంబైలో ప్లాన్ చేయటంతో.. అక్కడ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఆధ్వర్యంలో ఈ సాంగ్ షూటింగ్ జరగనుంది. ఆ తర్వాత “బోలా శంకర్” షూటింగ్ కోసం మలేషియాకు వెళ్ళనున్నారు. ఇంకొక నెలలో బాబీ దర్శకత్వంలో “వాల్తేరు వీరయ్య” షూటింగ్ కూడా మొదలుపెట్టే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. దాదాపు మూడు సినిమాలను త్వరగా కంప్లీట్ చేసి తరహాలో చిరంజీవి.. రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Share

Recent Posts

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

5 mins ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

2 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

3 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

3 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

4 hours ago

బాలకృష్ణకు చెల్లి అనగానే బోరున ఏడ్చేసిన హీరోయిన్ లయ.. ఎందుకంటే!

ఒకప్పటి హీరోయిన్ లయ స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ ముద్దుగుమ్మ 2000 కాలంలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కెరీర్ పీక్…

4 hours ago