Subscribe for notification

AP Politics: సెంట్రల్ ఇంటెలిజెన్స్ సెన్సేషన్ రిపోర్టు ..! మూహూర్తం.. పొత్తులపై..

Share

AP Politics: ఏపి రాజకీయ వర్గాల్లో ముందస్తు ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందనీ, ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో అసెంబ్లీని రద్దు చేసి వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలకు వెళుతుందని ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఫేక్ ప్రచారమే. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే ఉంది కానీ ఏడాదిన్నరకు ముందు అసెంబ్లీని రద్దు చేసే అవసరం వైసీపీకి, పార్టీ అధినేత, సీఎం జగన్ కు లేదు. కాకపోతే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఒక పకడ్బందీ ప్రణాళిక అయితే ఉంది. దీనిపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఫోకస్ చేసి ఒక రిపోర్టు తయారు చేసి కేంద్రానికి పంపినట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలకు సంబంధించి కావచ్చు లేక ఏపి అంతర్గత రాజకీయ వ్యవహారాలకు సంబంధించినవి కావచ్చు.

AP Politics central intelligence sensational

AP Politics: జగన్మోహనరెడ్డి పాలన మీద 65 శాతం సంతృప్తి

ప్రస్తుతం ఏపి రాజకీయ పరిస్థితులపై క్లారిటీ లేదు. తెలుగుదేశం పార్టీ ఈజీగా 120 – 130 స్థానాలు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. ఇటీవల మహానాడు తరువాత చంద్రబాబు పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి 124 నుండి 130 స్థానాలు వస్తాయనీ, జనసేనతో పొత్తుతో పోటీ చేస్తే 140 నుండి 160వరకూ రావచ్చు అని అన్నారు. ఇదే క్రమంలో వైసీపీ విషయానికి వస్తే జగన్మోహనరెడ్డి పాలన మీద 65 శాతం సంతృప్తి ఉందనీ, కొందరు ఎమ్మెల్యేల పనితీరుపైనే సంతృప్తి శాతం తక్కువగా ఉందని అంటున్నారు. అయినప్పటికీ ఎన్నికల్లో మాత్రం 130 నుండి 140 సీట్లు వరకూ రావచ్చు అని వైసీపీ అంతర్గతంగా లెక్కలు వేసుకుంటుంది. రెండు పార్టీలు ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నాయి. ఇదే సందర్భంలో పొలిటికల్ కన్ఫ్యూజన్ ఉంది.

50 నియోజకవర్గాల్లో వైసీపీకి తిరుగులేదు

రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అయిదేళ్లు పరిపాలన చేసింది. వైసీపీ మూడేళ్ల పరిపాలన పూర్తి చేసుకుంది. ఎవరు బాగా చేశారు..? ఏ వర్గాలకు ఎవరు మేలు చేశారు..? అనేది కొన్ని వర్గాల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో జగన్మోహనరెడ్డి ఒక బ్రాండ్. జగన్మోహనరెడ్డే వీళ్లకు హీరో. రాష్ట్రంలోని 50 నియోజకవర్గాల్లో వైసీపీ ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టినా గెలిచే పరిస్థితి ఉంది. ఇది ఎవరూ కాదనలేరు. ఎందుకంటే.. ఈ వర్గాలకు నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కేంద్ర ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలో వాస్తవిక పరిస్థితులపై అంచనాలకు రావచ్చు అని అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల లెక్క సరైంది కాదు, మరో ఆరు నెలల్లో పరిస్థితులు ఏ విధంగానైనా మార్పులు చెందే అవకాశం ఉందనీ అప్పుడు తీసుకునే అంచనాలే కరెక్టుగా ఉంటాయనీ భావిస్తున్నారుట.

ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా బీజేపీ రాజకీయ వ్యూహం

రాష్ట్రంలో ఏ పార్టీకి ప్రజలు మొగ్గుచూపుతున్నారు..? ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు..? అనేది డిసెంబర్ నాటికి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందనేది ఇంటెలిజెన్స్ కు నివేదిక వస్తుంది. అప్పటి వరకూ వచ్చే అంచనాలు అన్నీ పార్టీకి వచ్చే అంచనాలే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత వరకూ ఉంది..? ఎంత మేరకు చీలే అవకాశం ఉంది..? టీడీపీికి ఎన్ని సీట్లు వస్తాయి..? జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి..? అనేది అంచనాలకు అందనివి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కువగా చీలితే మరల వైసీపీనే అధికారంలోకి వస్తుంది. పొత్తులకు సంబంధించి కూడా క్లారిటీ రావడానికి ఒక ఆరు నెలల సమయం పడుతుంది. జనసేన, టీడీపీ పొత్తులకు సంబంధించి ప్రతిపాదనల దశలోనే ఉంది కానీ ఇంత వరకూ నేరుగా చర్చలు జరగలేదు. ఒక అవగాహనకు రాలేదు. డిసెంబర్ నాటికి దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ పని తీరుపైనా, పార్టీల పొత్తులపైనా డిసెంబర్ నాటికి ఒక క్లారిటీ వస్తుంది. అప్పటి పరిస్థితులు, ఇంటెలిజెన్స్ నివేదక ఆధారంగా కేంద్రంలోని బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. వైసీపీకి మద్దతు పలకాలా..? లేక టీడీపీతో మళ్లీ కలవాలా..? ఈ రెండు కాకుండా జనసేనతోనే కలిసి కూటమిగా వెళ్లాలా..? అనే దానిపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.


Share
Special Bureau

Recent Posts

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

25 mins ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

2 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

2 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

3 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

4 hours ago

Maharashtra: మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ శిందే

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…

4 hours ago