Bhola Shankar: సంక్రాంతి పండుగ నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం ప్రారంభంలో పెద్ద సినిమాగా సంక్రాంతి కానుకగా మొదట బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి విడుదలయ్యింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఒక రోజు వ్యవధిలో చిరంజీవి కొత్త సినిమా వాల్తేరు వీరయ్య కూడా రిలీజ్ అవుతూ ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుండి వెబ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కి చిరంజీవి వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

దీనిలో భాగంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న “బోళా శంకర్” సినిమా రిలీజ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కుదిరితే వేసవి కానుకగా మే నెలలో విడుదల చేసే అవకాశం ఉందని లేకపోతే దసరా పండుగకు రిలీజ్ చేయొచ్చని అప్డేట్ ఇచ్చారు. సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. ఈనెల 17వ తారీకు నుండి “బోళా శంకర్” కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది అని తెలియజేశారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెల పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

అజిత్ నటించిన “వేదాలం” సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెలుగులో తెరకెక్కుతోంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో బోళా శంకర్ స్టోరీ ఉండనుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు నచ్చే రీతిలో… కథలో మార్పులు చేయడం జరిగింది. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ రిలీజ్ చేసిన చిరంజీవి ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య కుదిరితే వేసవిలో “బోళా శంకర్” కూడా వచ్చేస్తుందని ప్రకటించడం మెగా అభిమానులలో సంతోషాన్ని కలిగించింది.