Thaman: సినిమా రంగంలో చాలా వరకు హీరోలే ఎక్కువ సహాయ కార్యక్రమాలు చేస్తారు. వారు చేసిన కార్యక్రమాలు చాలా హైలైట్ అవుతాయి. ఎక్కువగా వార్తల్లో కవరేజ్ రావడంతో లక్షలలో.. సినిమా హీరోలు ఇతరులకు ఖర్చు చేస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటారు. కొంతమంది సంస్థల ద్వారా సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలు మ్యూజిక్ దర్శకులలో ఇప్పటివరకు సహాయం చేసిన వారు పెద్దగా లేరని చెప్పవచ్చు. ఇటువంటి క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్యాన్సర్ రోగికి పది లక్షల రూపాయలు సహాయం అందించాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే ఆహా ఓటీటీ షోలో ఇండియన్ ఐడిల్ తెలుగు సింగర్ కార్యక్రమంలో తమన్, గీతా మాధురి, చంద్రబోస్ న్యాయ నిర్ణయితలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా తమన్ టీం మ్యూజిక్ టీంలో ప్యాడ్స్ వాయించే ఒకతను క్యాన్సర్ కి గురై హాస్పిటల్లో కీమోతెరపి చేయించుకోవలసి వస్తే 10 లక్షల అవసరం కావటంతో తమన్ అందించినట్లు గీతామాధురి చెప్పుకొచ్చారు. కిమో వల్ల అతనే బాడీ మొత్తం డామేజ్ అయింది. అయితే పది లక్షల కడితేనే హాస్పిటల్ నుండి బయటకు పంపిస్తామని చెప్పటంతో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియకపోవడంతో వెంటనే విషయం తెలుసుకుని తమన్ గారు ఆర్థిక సహాయం చేసి వెంటనే ఆ బిల్స్ మొత్తాన్ని క్లియర్ చేశారు. ఆరోజు ఆ కుటుంబం మొత్తం ఎంతగానో సంతోషించింది.. అని గీతా మాధురి చెప్పుకొచ్చారు.
ఇక ఇదే సమయంలో మనకి సమాజం లో మనం సమాజానికి మంచి చేయటానికి ఇవ్వటం మన వంతు బాధ్యత అని తమన్ బదులు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్ హవా కొనసాగుతోంది. “అలా వైకుంఠపురం” నుండి తమన్ అందిస్తున్న మ్యూజిక్ ఆల్బమ్స్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. చాలా సినిమాలు తమన్ అందించిన సంగీతం వల్లే బ్లాక్ బస్టర్ విజయాలు అయ్యాయి. ముఖ్యంగా పాండమిక్ తర్వాత బాలకృష్ణ నటించిన అఖండ, మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట, వీరసింహారెడ్డి, భీమ్లానాయక్ సినిమాలు విజయం సాధించడంలో తమన్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చాలా సినిమాలకు మనోడే సంగీతం అందిస్తూ ఉన్నాడు.