Samantha: సమంత – నాగ చైతన్య… టాలీవుడ్ అందమైన జంటగా పేరుగాంచిన యువ నటీనటులు. ఏ మాయ చేసావే సినిమాలో నటించిన తరువాత ఒకరినొకరు ఇష్టపడటంతో పెళ్లితో ఒక్కటయ్యారు. తరువాత అనూహ్య కారణాల వలన వారు విడాకులు తీసుకున్న విషయం తెలిసినదే. అయితే వీరి విడాకులు టాలీవుడ్లో పెను ప్రకంపనలే సృష్టించాయి. వారి విడిపోయి నెలలు గడుస్తున్నా మీడియా, అక్కినేని అభిమానులు మాత్రం ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే వీలైనప్పుడల్లా ఆ విషయాన్ని పదే పదే తెరమీదకి తెస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Samantha: నాగచైతన్య vs సమంత!
ఇదిలా ఉంటే డివోర్స్ తర్వాత ఇద్దరు కూడా కెరీర్ ని చాలా సీరియస్ గా తీసుకొని ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో సమంత, చైతూ పలు ప్రాజెక్ట్స్ కి సైన్ చేశారు. సామ్ ఐతే ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయిది. దానికి ఉదాహరణలే పుష్ప మరియు ఫామిలీ మాన్ 2. ఇక నాగ చైతన్య చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. దానికి ఓ ఉదాహరణగా ఇటీవల వచ్చిన ‘బంగార్రాజు’ సినిమాని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చైతన్య నటిస్తున్న ప్రాజెక్ట్స్ లో దూత అనే వెబ్ సిరీస్ ఆయనకు చాలా ప్రత్యేకం. దర్శకుడు విక్రమ్ కుమార్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ వెబ్ సిరీస్ లో సామ్ నిరూపించుకోగా, ఈ వెబ్ సిరీస్ తో నాగ చైతన్య ప్రూవ్ చేసుకోవలసి వుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సమంతను నాగ చైతన్య మర్చిపోలేకపోతున్నాడా?
ఇకపోతే, దూత షూటింగ్ సమయంలో నాగ చైతన్య కాస్త డల్ గా కనిపించేవాడట. మొదట షూటింగులో భాగంగానే అలా ఉంటున్నాడు అనుకున్న చిత్ర యూనిట్, తరువాత అసలు విషయం తెలుసుకొని చైతన్యను బోధపరిచే ప్రయత్నం చేశారట. అసలు విషయం ఏమంటే, సామ్ ని విడిచిపెట్టిన తరువాత చే కాస్త రియలైజ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం చే తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని విలపించాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!