టెక్నాలజీ

Instagram: ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్..!!

Share

Instagram: ప్రపంచవ్యాప్తంగా యువత ఎక్కువగా సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ ప్లాట్ ఫామ్ లో ఉంటున్నట్లు చాలా సర్వేలలో ఫలితాలు వచ్చాయి. దీంతో యువతను ఆకర్షించడానికి.. వారు ఇంస్టాగ్రామ్ నుండి తొలగి పోకుండా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వాడే వారికి ఆ సంస్థ గుడ్ న్యూస్ తెలియజేసింది. అదేమిటంటే “రిప్లై వైల్ యూ బ్రౌస్” అనే పేరుతో కొత్త ఫీచర్ ఇంస్టాగ్రామ్ తీసుకురావడం జరిగింది.Good news for those who have an account on Instagramఈ కొత్త ఫీచర్ వల్ల ఇంస్టాగ్రామ్ యూజర్ బ్రౌజ్ చేస్తున్న సమయంలో ఎవరైనా మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడానికి … ఇన్ బాక్స్ లోకి వెనక్కి వెళ్లకుండా డైరెక్టుగా మెసేజ్ ఓపెన్ చేసి.. రిప్లై ఇచ్చుకోవచ్చు. అంతమాత్రమే కాదు ఈ కొత్త ఫీచర్ సహాయంతో కంటెంట్ చాలా వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు. షేర్ బటన్ నొక్కి పట్టుకోవడం ద్వారా క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్నవారికి కంటెంట్ నీ వేగంగా షేర్ చేసుకునే అవకాశం ఉంది.

Good news for those who have an account on Instagram

అంతమాత్రమే కాదు ఇంస్టాగ్రామ్ లో మ్యూజిక్ స్ట్రీమింగ్ సౌకర్యాలను ఏనెబుల్ చేసుకునే విధంగా కొత్త ఫీచర్ కూడా త్వరలో తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ వల్ల 30 సెకన్ల నిడివి ఉన్న పాట ఇతరులతో షేర్ చేసుకునే అవకాశం రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానుంది. అంతమాత్రమే కాదు ఇంస్టాగ్రామ్ లో ఎవరికైనా మెసేజ్ పంపించే ముందు @Silent అని టైప్ చేసి మెసేజ్ సెండ్ చేస్తే అవతల చేరవలసిన వ్యక్తికి చాలా సైలెంట్ గా నోటిఫికేషన్ చేరుతోంది. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ యువత సమయం గడుపుతూ ఉండటంతో.. కొత్త ఫీచర్లతో ఆకర్షిస్తూ… యూజర్లు ఏమాత్రం చేజారిపోకుండా చాలా జాగ్రత్త పడుతోంది.


Share

Related posts

జూమ్ ఆఫర్ చూశారంటే కళ్ళు తిరుగుతాయ్.. అలా ఉంది ఆఫర్!

Teja

సరైన సమయంలో ఫేస్ బుక్ కీలక నిర్ణయం..! రాజకీయ నాయకులకు షాక్?

arun kanna

Assembly election results: బెంగాల్ లో పారని బీజేపీ పాచిక..! కొనసాగుతున్న టీఎంసీ హవా..తమిళనాడులో డీఎంకే, కేరళలో ఎల్డీఎెఫ్

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar