సినిమా

Nagarjuna: ‘భీమ్లా నాయక్’ సైడిస్తే..’బంగార్రాజు’ ఎంట్రీ ఇస్తున్నాడా..!

Share

Nagarjuna: ఈ సారి సంక్రాంతి బరినుంచి ఓ సినిమా తప్పుకుంటే మరో సినిమా ఎంట్రీ ఇస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాల అఫీషియల్ తేదీలు మారిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి పోటీ గట్టిగానే ఉంది. కానీ, కరోనా కారణంగా నిర్మాతలు ఇప్పటికే చాలా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందుకే పోటీ లేకుండా సోలో డేట్ చూసుకొని నిర్మాతలను గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలోనే అందరికంటే ముందు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సర్కారు వారి పాట సినిమాను రాజమౌళి కోసం పోస్ట్‌పోన్ చేసుకున్నారు.

nagarjuna-is entering in sankranthi race
nagarjuna-is entering in sankranthi race

అయితే ఇన్నాళ్ళు ఆర్ఆర్ఆర్ సినిమాకు అలాగే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటు హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్ గట్టి పోటీగా ఉండింది. రాజమౌళి, చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య ఎంత ట్రై చేసినా పవన్ కళ్యాణ్ – నిర్మాత చినబాబు, నాగవంశీ భీమ్లా నాయక్ సినిమాను పోస్ట్‌పోన్ చేయలేదు. అంతేకాదు అడుగడునా సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు క్లారిటీ ఇస్తూ అనుకున్న తేదీ జనవరి 12నే సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని కన్‌ఫర్మేషన్ ఇస్తూ వచ్చారు.

Nagarjuna: జనవరి 15న బంగార్రాజు చిత్రం బరిలో నిలిచే అవకాశాలు..!

దాంతో భీమ్లా నాయక్ ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గదనుకున్నారు. కానీ, తాజాగా జరిగిన నిర్మాతల సమావేశంలో పోస్ట్‌పోన్ చేయించారు. ఇలా పవన్ కళ్యాణ్ సినిమా పోస్ట్‌పోన్ అయిందో లేదో అలా నాగార్జున – నాగ చైతన్య నటిస్తున్న బంగార్రాజు చిత్రాన్ని బరిలో దింపేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి 15న బంగార్రాజు చిత్రం సంక్రాంతికే బరిలో నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే పాన్ ఇండియన్ సినిమాలతో బంగార్రాజుకు మైనస్ అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి దీనిపై క్లారిటీ త్వరలో వస్తే గానీ అసలు విషయం తెలుస్తుంది.


Share

Related posts

అభిమానుల‌కు గిఫ్ట్ ఇవ్వ‌నున్న బాల‌కృష్ణ‌

Siva Prasad

జూన్‌లో `కార్తికేయ 2`

Siva Prasad

ఆచార్య కి డేట్స్ ఇచ్చిన రాం చరణ్ .. కొరటాలకి ఈ డేట్స్ సరిపోతాయా ..?

GRK