సినిమా

ప్రయత్నమే మొదటి విజయం

Share

హిట్స్ కే విసుగొచ్చేలా బ్యాక్ టు బ్యాక్ 8 ఎనిమిది సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి నార్మల్ హీరో నుంచి నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని, కృష్ణార్జునయుద్ధంతో పూర్తిగా డీలా పడిపోయాడు. జెట్ స్పీడ్ తో వెళ్తున్న నాని కెరీర్ కి ఒక్క ఫ్లాప్, స్పీడ్ బ్రేకర్ లా అడ్డుపడింది. ఈ మూవీ ఇచ్చిన రిజల్ట్ నుంచి బయట పడిన నాని, ఇప్పుడు జెర్సీ సినిమా చేస్తున్నాడు. సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా బయటకి వచ్చిన ఫస్ట్ లుక్ మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక షూటింగ్ దాదాపు 75% పూర్తి కాబోతుండడంతో, చిత్ర యూనిట్ సంక్రాంతి కానుకగా జెర్సీ టీజర్ రిలీజ్ చేశారు. క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించనున్న నాని, 36 ఏళ్ల వయసులో తన డ్రీమ్ కోసం ఎలా కష్టపడ్డాడు, లాస్ట్ కి దాన్ని అచీవ్ చేశాడా లేదా అనేదే ఈ సినిమా కథలాగా కనిపిస్తుంది. టీజర్ లోని కెమెరా వర్క్, బీజీఎమ్ బాగున్నాయి. డైలాగ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు కనిపిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది


Share

Related posts

Love story : లవ్ స్టొరి మీద వకీల్ సాబ్ ఎఫెక్ట్ పడుతుందా..?

GRK

Telugu cinimaalu : ఆ భాషలో సత్తాచాటిన తెలుగు సినిమాలు ఇవే..!

Teja

NTR : ఈ వార్త నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆపగలమా…? ఏకంగా హాలీవుడ్ ఆఫర్

arun kanna

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar