Nayan-Vignesh: లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ప్రమాయణం గురించి అందరికీ తెలిసిందే. గత ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతున్న ఈ లవ్ బర్డ్స్.. ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలెక్కుతారా అని అభిమానులే కాదు సినీ తారలు సైతం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచీ వీరిద్దరి పెళ్లి అప్పుడు, ఇప్పుడు అంటూ ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి.
కానీ, ఏది నిజం కాలేదు. అయితే ఎట్టకేలకు నయన్-విఘ్నేశ్ లు డేటింగ్‌కు ముగింపు పలికి మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే పెళ్లి డేట్, ప్లేస్ కూడా లాక్ చేసుకున్నారట. జూన్ 9న, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో నయన్, విఘ్నేశ్‌ల వివాహం జరగబోతున్నుట్ల తెలుస్తుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఈ రోజు విఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని ఈజంట దర్శించుకుంది. అయితే పెళ్లి వేదికను బుక్ చేసుకునేందుకే నయన్, విఘ్నేశ్‌లు తిరుమల వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారని సమాచారం. పెళ్లిని సింపుల్‌గా కానిచ్చేసి.. ఆ తర్వాత భారీ స్థాయిలో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తారట. ఈ రిసెప్షన్‌కు ఇండస్ట్రీ మిత్రులు, రాజకీయ నాయకులను ఆహ్వానించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే నయన్, విఘ్నేశ్‌ల నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, నయన్ గతంలో తమిళ స్టార్ హీర్ శింబు, డ్యాన్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాలతో ప్రేమ, పెళ్లి వరకు వెళ్లింది. కానీ, పలు కారణాల వల్ల వారిద్దరితోనూ నయన్‌కు బ్రేకప్ అయింది. రెండు బ్రేకప్ ల అనంతరం నయన్‌కు `నేనూ రౌడీనే` సినిమా సమయంలో డైరెక్టర్ విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమ, ఇప్పుడు పెళ్లి వరకు తీసుకువచ్చింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!