Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ తొలినాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం “ఖుషి”. సరికొత్త ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ నటన యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏఎం రత్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఖుషి” సినిమాలో “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే”..సాంగ్ రీమిక్స్ చేయాలన్నది పవన్ ఆలోచన. ఇంక సినిమాలోని ఫైట్స్ పవన్ కళ్యాణ్ చాలా సులువుగా చేసేసారు. పవన్ మాస్ పల్స్ అర్దం చేసుకోవడంతో… ఎక్కడా కూడా పట్టుబట్టి మరీ నటించినట్లు అనిపించలేదు.

పవన్ తన కెరియర్ లో ఒక్క సినిమానే దర్శకత్వం చేసినప్పటికీ, అతనిలో మంచి ఫిలిం మేకర్ ఉన్నాడు అని ఏఏం రత్నం చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే పవన్ “ఖుషి” సినిమా మళ్లీ రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 31వ తారీకు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కోసం మరోసారి విడుదల చేసిన ట్రైలర్ నెట్ ఇంట ట్రెండింగ్ లో ఉంది. సిద్దు సిద్ధార్థ రాయ్ అంటూ పవన్ చేపిన డైలాగ్స్ … సినిమాలో నడుము సీన్… పవన్ అమాయకమైన హావభావాలు .. లేటెస్ట్ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.

దాదాపు 22 సంవత్సరాల తర్వాత… మళ్లీ రీ రిలీజ్ అవుతున్న గాని .. సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారటం పవన్ కళ్యాణ్ క్రేజ్ కి నిదర్శనం. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని కూడా ఏ.ఏం రత్నం నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో “ఖుషి” మళ్లీ విడుదల నేపథ్యంలో ఏఏం రత్నం చేసినా కామెంట్స్.. కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.