Unstoppable 2: ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” సీజన్ 2 టాకీ షో పవన్ కళ్యాణ్ సెకండ్ ఎపిసోడ్ తో ఈ సీజన్ కంప్లీట్ అయింది. ఈ లాస్ట్ ఎపిసోడ్ లో ఎక్కువగా రాజకీయాల గురించి పవన్ మాట్లాడటం జరిగింది. జయపజయాలతో సంబంధం లేకుండా పోరాటమే.. దిశగా రాజకీయాల్లో ఇంకా జీవితంలో రాణించాలని తెలియజేశారు. ఇంకా తన వ్యక్తిగత మరియు సినిమా ఇండస్ట్రీలో వాతావరణం గురించి కూడా ఈ ఎపిసోడ్ లో పవన్ చేసిన వ్యాఖ్యలు ఎంతో సంచలనం సృష్టించాయి. హీరోల మధ్య పోటీ వాతావరణం ఉండొచ్చు గాని.. ఒకరి బాగోగులు మరొకరు కోరుకునే మనస్తత్వం కలిగినది తమ కుటుంబం అని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో చిన్ననాటి టైములో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినట్లు సరికొత్త విషయాన్ని ఈ షోలో పంచుకోవడం జరిగింది. 17 సంవత్సరాల వయసులో జీవితంలో ఏదీ సాధించలేక ఒకపక్క అనారోగ్యంతో బాధపడుతూ చాలా మానసిక సంఘర్షణ లోనై డిప్రెషన్ లోకి వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఒకానొక టైములో మా అన్నయ్య చిరంజీవి గారికి ఉన్న లైసెన్స్ రివాల్వర్ తీసుకుని కాల్చుకుందామని ప్లాన్ వేశాను. ఆ విధంగా నెలరోజులపాటు ఇంట్లో మానసిక వేదనతో బాధపడుతూ… ఒకరోజు అన్నయ్య షూటింగ్ కి వెళ్లిన సమయంలో కాల్చుకుందామని తుపాకీ తీసినప్పుడు వెంటనే వదిన సురేఖ మా రెండో అన్నయ్య నాగబాబు వచ్చి ఆపేశారు.
ఆ తర్వాత నన్ను అదే సమయంలో చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లి పరిస్థితి వివరించి చెప్పటంతో. నువ్వు చదువు రాలేదని ఇంకా ఏది గెలవలేదని కాదు బతికితే చాలు మాకు అని అన్నయ్య భరోసా ఇచ్చాడు. ఆ ధైర్యం నన్ను అప్పుడు కాపాడింది.. అని పవన్ తెలియజేయడం జరిగింది. అంతేకాదు తాను చిన్ననాటి టైంలో ఆస్తమా అనారోగ్యం కారణంగా… ప్రతిసారి హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చేది. దాంతో సరిగ్గా చదువు కొనసాగించలేకపోయినట్లు.. సరైన దృష్టి పెట్టలేదని పవన్ తెలియజేయడం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!