NewsOrbit
Entertainment News సినిమా

Adipurush: రిలీజ్ అయిన ప్రభాస్ “ఆదిపురుష్” ట్రైలర్..!!

Share

Adipurush: ప్రభాస్ కొత్త సినిమా “ఆదిపురుష్” ట్రైలర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాదులోని AMB మాల్ లో నిన్న ట్రైలర్ నీ స్పెషల్ స్క్రీనింగ్ చేయగా అభిమానులలో మరింత ఆత్రుత పెరిగింది. తాజాగా విడుదలైన కొత్త ట్రైలర్ ని చూసిన అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. జూన్ 16వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ కాబోతున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క ట్రైలర్ ముందుగా తెలుగు భాషలో రిలీజ్ కావటంతో… టాలీవుడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ సంతోషంగా ఉన్నారు.

Prabhas Adipurush official telugu trailer released

అద్భుతమైన గ్రాఫిక్స్, డైలాగ్స్ మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. “ఆదిపురుష్” ట్రైలర్ యూట్యూబ్ నీ ఆకట్టుకుంటుంది. హిందీ ట్రైలర్ కు 25 నిమిషాలకు 10 లక్షల వ్యూస్ మరియు తెలుగు ట్రైలర్ కు 30 నిమిషాలకు 10 లక్షలు వ్యూస్ రావటంతో ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి అని అర్థమవుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా జనవరి నెలలోనే విడుదల కావాలి. అయితే అప్పట్లో గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకపోవడంతో… మళ్లీ రీ డిజైనింగ్ చేయడం జరిగింది.

Prabhas Adipurush official telugu trailer released

అయితే ఇప్పుడు సరికొత్త మెరుగులు దిద్ది ఆకర్షణీయంగా… అందరికీ నచ్చే రీతిలో “ఆదిపురుష్” సినిమాని విడుదల చేస్తున్నారు. రామాయణం నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించడం జరిగింది. బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి మొదట ప్రమోషన్ కార్యక్రమాలు నార్త్ లో భారీ ఎత్తున చేయాలని మేకర్స్ ప్లాన్ చేయడం జరిగింది. సరిగ్గా విడుదలకు ముందు సౌత్ లో “ఆదిపురుష్” ప్రమోషన్స్ గ్రాండ్ గా చేసే రీతిలో షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్లు సమాచారం.

 


Share

Related posts

రకుల్ ప్రీత్ సింగ్ మీద రూమర్స్ రావడానికే ఆ సినిమా ఒప్పుకున్నట్టైందా ..?

GRK

బిగ్ బాస్ 4 : ఎలిమినేట్ అయిపోయిన అవినాష్ కు నాగార్జున బంపర్ ఆఫర్

arun kanna

Varalaxmi Sarathkumar : టాలీవుడ్‌కి దొరికిన వెర్సటైల్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్‌కుమార్..హీరోయిన్ పాత్రల కోసం వెంపర్లాడకపోవడం ఆమె గొప్పతనం

GRK