Brahmamudi: స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం టాప్ TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సీరియల్ బ్రహ్మముడి. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ కథ ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఈరోజు జరగబొయ్యే ఎపిసోడ్ కూడా ఎంతో ఆసక్తి గా ఉండబోతుంది. కావ్యకి 16 రోజుల పండుగ చెయ్యడానికి ఇంట్లో మొత్తం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. తనతో పెళ్లి ఏమాత్రం ఇష్టం లేని రాజ్ తన తల్లి తో చిరాకు పడుతుంటాడు. వాళ్ళు ఏమి చేసినా చూస్తూ కూర్చుకోవాలా అమ్మ, మోసం చేసి పెళ్లి చెయ్యడమే కాకుండా, సంప్రదాయాల పేరుతో పూజా , వ్రతం తొక్కా తోటకూరా అంటే మనం మౌనంగా భరించాలా? అని చిరాకు పడుతున్న సమయం లో తల్లి అపర్ణ తప్పదు నాన్న.. ఇప్పుడు జరుగుతున్న తతంగం గురించి కాదు. రేపు జరగబొయ్యే మంచి గురించి ఆలోచించు అని అతనికి సర్ది చెప్తుంది.

Brahma Mudi: రాహుల్, స్వప్నల మ్యాటర్ రాజ్ కు తెలిసిపోతుందా? కోపంతో రగిలిపోతున్న రాజ్..
ఎలాగో ఇంకొన్ని రోజుల్లో కావ్య తనకి తాను ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని నువ్వే చెప్పావ్ కదా, ఇక పూజలు చేసుకోని, యజ్ఞాలు చేసుకోని మనకెందుకు అని అంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు ఒప్పుకోవడం లేదు అమ్మా, వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు అని అంటాడు రాజ్. అప్పుడు అపర్ణ ఎన్ని నాటకాలు ఆడినా ఎట్టి పరిస్థితిలో కండిషన్ మీద ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాను అనే నిజం బయటకి రానివ్వకు. నిజం బయటకి తెలిస్తే నీ తాతయ్య వాళ్ళు నిన్ను అర్థం చేసుకోక పోగా , నువ్వే తప్పు చేస్తున్నావని, కావ్య కి అన్యాయం చేస్తున్నావని అందరూ నిన్నే తప్ప పడుతారు. కావ్య చేసిన తప్పుని మర్చిపోయి తనకే సానుభూతి చూపిస్తారు. రెండు రోజుల్లో తన తప్పు తనే ఒప్పుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాస్త భరించు అని రాజ్ కి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది అపర్ణ. కానీ రాజ్ అయిష్టంగానే ఒప్పుకొని వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari: ముకుంద ఎత్తుగడకి చిత్తు కానున్న కృష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్
మరో వైపు స్వప్న ఇంట్లో ఎవ్వరు లేరని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఎప్పుడు కాపలాగా ఉండే పెద్దమ్మ కూడా ఇంట్లో లేదు, ఎవరిదో పెళ్ళికి వంట చేస్తాను అని చెప్పి అక్కడకి వెళ్లి నాకు ఫ్రీడమ్ ఇచ్చేసింది. ఆ రాజ్ ఇంట్లో కూడా ఎవ్వరూ ఉండరు, అతనిని ఇక్కడికి పిలిచి ప్రేమగా మాట్లాడి నా కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది స్వప్న. ఇంట్లో అందరూ వెళ్లిపోయారో లేదో చెక్ చేద్దామని హాల్ లోకి వచ్చి చూడగా, అప్పుడే కావ్య 16 రోజుల పెళ్ళికి వెళ్తున్న ఇంట్లో వాళ్ళు స్వప్న ని చూసి అప్పూ.. శుభమా అంటూ శుభకార్యానికి వెళ్తుంటే అపశకునం ఎదురైంది. మళ్ళీ దరిద్రం లాగ అక్కడకి వచ్చి మా కావ్య పెళ్లి చెడగొట్టొద్దు అని చెప్పు అని అంటుంది.

అప్పుడు స్వప్న దానికి సమాధానం చెప్తూ నేను మరీ అంత సిగ్గు లేకుండా బ్రతకడం లేదమ్మా.. మాటలు అనిపించుకోవడం నీకు అలవాటు ఏమో కానీ, నాకు కాదు నాకు సిగ్గు ఉంది అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవలు అయిపోయిన తర్వాత స్వప్న రాహుల్ కి కాల్ చేసి ఇంట్లో ఎవ్వరూ లేరు ఇదే మనకి మంచి రొమాంటిక్ టైం, ఇక్కడకి వచ్చేయి అని పిలుస్తుంది. ఈమె రాహుల్ కి ఫోన్ చెయ్యడం, రాహుల్ ని ఇంటికి రమ్మనడం , ఇవన్నీ అప్పూ వింటుంది. నువ్వు పిలవగానే ఎగేసుకొని వచ్చేస్తాను అనుకున్నావా.. నేను రాను అంటాడు. అప్పుడు స్వప్న నువ్వు ఇక్కడికి రాలేదు అనుకో, నేనే అక్కడికి రావాల్సి వస్తుంది. అక్కడికి వచ్చి మన ఇద్దరి విషయం అందరికీ చెప్పేస్తాను అని బెదిరిస్తుంది. అప్పుడు రాహుల్ ఆమ్మో వద్దు. మన ఇద్దరం కలుసుకోవాడానికి ఒక రొమాంటిక్ ప్లేస్ ఉంది, అక్కడ కలుద్దాం అంటాడు. ఇదంతా విన్న అప్పూ స్వప్న ని రాహుల్ ని ఫాలో అవుతుంది, ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.