Rakul: సాధారణంలో సినీ తారలు అందులోనూ హీరోయిన్లు తమ లవ్ ఎఫైర్స్ గురించి బయట పెట్టడానికి ఏ మాత్రం ఇష్టపడరు. కానీ, అందుకు ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా భిన్నం. గత ఏడాది తన బర్త్‌డే నాడు బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నానని రకుల్ ఓపెన్‌గానే చెప్పేసింది.
షూటింగ్స్‌ను గ్యాప్ దొరికిందంటే ప్రియుడితోనే టైమ్ స్పెండ్ చేస్తోంది. పార్టీలకు, ఫంక్షన్లకు అతడితో కలిసి వెళ్తోంది. అలాగే వీలు చిక్కినప్పుడల్లా ఈ లవ్ బర్డ్స్ వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ జాకీతో ప్రేమాయణంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
`జాకీ భగ్నానీ, నేను మంచి ఫ్రెండ్స్. మా అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డాం. మా రిలేషన్షిప్ గురించి మాకు ఓ క్లారిటీ రాగానే.. వీలైనంత త్వరగా ప్రపంచానికి తెలియజేశాం. ఎందుకంటే రిలేషన్‌ను బయటకు చెప్పకపోతే మా గురించే వచ్చే వార్తలు, పుకార్లతో ప్రశాంతంగా ఉండలేం. మన లైఫ్‌లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగే మనకోసం ఒకరు ఉంటారు.
సెలబ్రిటీలు కావడంతో మాపై అందరి దృష్టి కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ నాకది ఇష్టం లేదు. అందుకే బహిరంగంగా మేము మా రిలేషన్ గురించి చెప్పేశాం. అయినా మా వ్యక్తిగత జీవితం గురించి కాదు, మేము చేసే వర్క్ గురించి అందరూ మాట్లాడుకోవాలి.` అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త వైరల్‌గా మారాయి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె `మిషన్ సిండెరెల్లా`, `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్`, `ఛత్రివాటి` అనే బాలీవుడ్ సినిమాలతో పాటు `అయలాన్` అనే తమిళ సినిమా కూడా చేస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!