NewsOrbit
Entertainment News సినిమా

Ram Boyapati: రామ్.. బోయపాటి సినిమా విడుదల తేదీ ఫిక్స్..!!

Share

Ram Boyapati: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ పల్స్ స్పెషలిస్ట్ దర్శకుడిగా పేరు సంపాదించిన బోయపాటి ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 20వ తారీకున సినిమా విడుదల చేస్తున్నట్లు లేటెస్ట్ గా సినిమా విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ హీరో రామ్ తన ట్విట్టర్ ఎకౌంటులో పోస్ట్ చేసి ..”వస్తున్నా.. అక్టోబర్ లో కలుద్దాం” అని ట్వీట్ చేశారు.

Ram Boyapati movie release date fixed

అంతకుముందు వరస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్..2019లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో హిట్ అందుకోవటం జరిగింది. ఆ తర్వాత రెడ్ సినిమాతో ఓ మాదిరి విజయ మంది ఉన్నారు. కానీ గత ఏడాది తమిళ దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో నటించిన “ది వారియర్” దారుణమైన పరాజయిం చవి చూడటం జరిగింది. ఈ సినిమాలో ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా రామ్ పవర్ ఫుల్ గా చూపించిన సినిమాలో దమ్ము లేకపోవడంతో.. బాక్స్ ఆఫీస్ వద్ద పడింది.

Ram Boyapati movie release date fixed

దీంతో రామ్ అభిమానులు ఇప్పుడు.. బోయపాటి సినిమా పైన ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో రామ్..బోయపాటి ఇద్దరు ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో దిగుతున్నారు. సో ఇద్దరు.. ఈ సినిమానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రిలీజ్ అయిన పోస్టర్ లో రామ్.. దున్నపోతు పట్టుకుని చాలా డిఫరెంట్ గా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. బోయపాటి “అఖండ” విజయంతో మంచి ఫామ్ లో ఉన్నారు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా రామ్ కీ మళ్లీ హిట్ పడలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


Share

Related posts

RRR: చరణ్, తారక్‌ల దెబ్బకి బాలీవుడ్ హీరో సినిమా ఒక్కరోజులోనే అవుట్..

GRK

ఆనందానికి అవధుల్లేవ్‌

Siva Prasad

ప్ర‌భాస్ `ఆదిపురుష్‌` విడుద‌ల వాయిదా.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

kavya N