సినిమా

RC15: మరోసారి రాజమండ్రిలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తేజ్..!!

Share

RC15: “RRR” సూపర్ డూపర్ హిట్ కావడంతో రామ్ చరణ్ తేజ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా విజయవంతంగా రాణిస్తున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో… భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

Ram Charan and Shankar movie new schduled in rajahmundry

రెండు రోజుల క్రితం వైజాగ్ లో బీచ్ రోడ్డు ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం జరిగింది. కాగా ఇప్పుడు తాజాగా రాజమండ్రిలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. గతంలోనే ఒక షెడ్యూల్ ఇక్కడ శంకర్ ప్లాన్ చేయడం జరిగింది. అయితే మరోసారి రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. దీంతో రాజమండ్రి లో షూటింగ్ లో పాల్గొనటానికి వచ్చిన రామ్ చరణ్ తేజ్ కి… అక్కడ అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

రామ్ చరణ్ తేజ్ రాజమండ్రిలో ఇటీవల వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. “రంగస్థలం” మొదలుకుని తర్వాత “ఆచార్య”.. ఇప్పుడు శంకర్ సినిమా షూటింగ్ లు ఎక్కువగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉన్నాయి. అయితే రాజమండ్రిలో ఈ సినిమాకి సంబంధించి ఇదే చివరి షెడ్యూల్ అని దింతో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం.


Share

Related posts

Nivisha Cute Wallpapers

Gallery Desk

Prabhas Heroine : నోరు జారిన ప్రభాస్ హీరోయిన్.. ఫక్కుమన్న నెటిజన్లు!

Ram

Alia bhatt – Pooja hegde: ఆలియా భట్‌ను ఫిక్స్ చేస్తే పూజా హెగ్డే పరిస్థితేంటీ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar