Ram Charan: గత కొంత కాలం నుంచీ ఆర్ఆర్ఆర్, ఆచార్య, ఆర్సీ 15 చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని భార్య ఉపాసనతో కలిసి వెకేషన్స్‌కు చెక్కేశారు. రెండేళ్ల తర్వాత రామ్ చరణ్ తో వెకేషన్ కు వెళ్తున్నాను అంటూ కొద్ది రోజుల క్రితం ఉపాసన పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే ఈ జంట ప్రస్తుతం ఫిన్లాండ్లో ఉన్నారు. అక్కడి పకృతి అందాలు చూసి పరవశించిపోతున్నారు. అలాగే మంచు ప్రదేశాల్లో విహరిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ టూర్ కి సంబంధించిన ఓ వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. `భూమ్మీదున్న అత్యంత ఆనంద ప్రదేశంలో చాలా ఆనందంగా ఉన్నాం` అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
దీంతో ఈ వీడియో చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ చిన్న పిల్లాడిలా మారిపోయి భార్యతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ ట్రాలీపై ఆటలాడటం, మంచు నీటిలో స్వీమ్ చేయడం, చలి మంటలు వేసుకోవడం, ప్లేట్స్‌ను బ్రేక్ చేయడం వంటి చిలిపి పనులు ఈ వీడియోలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మొత్తానికి రామ్ చరణ్, ఉపసనల వెకేషన్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్` మార్చి 25న విడుదలక కాబోతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
https://www.instagram.com/reel/CbC0U58BgZR/?utm_source=ig_web_copy_link
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!