Rakshit Shetty: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ప్రేమాయణం నడిపించిన సంగతి తెలిసిందే. `కిరిక్ పార్టీ` అనే కన్నడ మూవీతో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇరుకుటుంబసభ్యులు ఒప్పుకోవడంతో రష్మిక-రక్షిత్‌లు 2017లో వైభవంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
కానీ, ఆ తర్వాత వచ్చిన పలు మనస్పర్థల కారణంగా ఈ జంట పెళ్లి వరకు వెళ్లకుండానే విడిపోయారు. రక్షిత్‌తో బ్రేకప్ తర్వాత కెరీర్‌పైనే ఫోకస్ పెట్టిన రష్మిక.. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈమె సౌత్‌తో పాటు నార్త్‌లో సత్తా చాటుతోంది. మరోవైపు కన్నడ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకుపోతున్నారు రక్షిత్ శెట్టి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఇప్పుడు రక్షిత్ పెళ్లి పీటలెక్కబోతున్నాడట. హీరోయిన్ రమ్యను రక్షిత్ వివాహం చేయకోబోతున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రక్షిత్ స్నేహితుడు, నటుడు రిషబ్ శెట్టి ఈ వార్తలపై స్పందిస్తూ.. మావాడికి సాండల్‌వుడ్ గోల్డెన్ గర్ల్‌తో పెళ్లా? అని ఫక్కున నవ్వేశాడు. రక్షిత్ రమ్యను పెళ్లాడబోతున్నాడనే వార్తలో నిజం లేదని స్పష్టం చేశాడు.
దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పుకారే అని తేలిపోయింది. కాగా, రక్షిత్ శెట్టి మరి కొద్ది రోజుల్లో `చార్లీ 777`తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కె.కిరణ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 10న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం రక్షిత్ ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!