సినిమా

Prabhas: వ‌రుస ఫ్లాపులొచ్చినా త‌గ్గేదే లే.. ప్ర‌భాస్ క్రేజ్‌కు ఇదో నిద‌ర్శ‌నం!

Share

Prabhas: `బాహుబ‌లి` సిరీస్‌తో నేష‌న‌ల్ వైడ్‌గా భారీ ఇమేజ్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ రెబ‌ల్ స్టార్‌ ప్ర‌భాస్.. ఆ త‌ర్వాత `సాహో`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం ఫ్లాప్ టాక్ వ‌చ్చినా.. బాగానే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. సాహో అనంత‌రం ప్ర‌భాస్ నుంచి `రాధేశ్యామ్‌` వ‌చ్చింది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది.

అయితే వ‌రుస ఫ్లాపులొచ్చినా ఆయ‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ అప్ డేట్ అందుకు నిద‌ర్శ‌నం అని చెప్పాలి. అస‌లేం జ‌రిగిందంటే.. హైదరాబాద్‌లోని నెహ్రు జూలాజికల్ పార్క్‌లో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌కు అధికారులు ప్రభాస్‌ పేరు పెట్టారు. రాజ‌సం ఉట్టిప‌డేలా క‌నిపించే రాయ‌ల్ బెంగాల్ టైగర్ కు ప్ర‌భాస్ పేరు పెట్ట‌డంతో.. ఇప్పుడీ విష‌యం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ప్ర‌భాస్ క్రేజ్ అంటే అట్లుంట‌ది మ‌రి అంటూ త‌మ అభిమాన హీరోపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల‌ ఓం రౌత్‌తో `ఆదిపురుష్‌` అనే భారీ ప్రాజెక్ట్ ను ఫినిష్ చేసిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప్ర‌శాంల్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌` అనే సినిమా చేస్తున్నారు.

అలాగే నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్‌-కె`ను కూడా ప‌ట్టాలెక్కించిన ఆయ‌న‌.. మ‌రోవైపు సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్‌` అనే మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. వీటితో పాటు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతితో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని టాక్ ఉంది.

 


Share

Related posts

కార్తీక దీపం సీరియల్: ఊహించని ట్విస్ట్…మోనితని చిక్కులలో పడేయనున్న అంజి!!!

Naina

పూజా హెగ్డే అటువంటి ట్రీట్ ఇస్తే ఏ నిర్మాతైనా వదులుతాడా ..?

GRK

Prabhas: ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆందోళనలో ప్రభాస్ ఫ్రెండ్స్..!!

sekhar