సినిమా

Sarkaru Vaari Paata Review: `స‌ర్కారు వారి పాట‌`పై ఫ‌స్ట్ రివ్యూ.. రేటింగ్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే!

Share

Sarkaru Vaari Paata Review: `గీత గోవిందం` ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చేసిన తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు.

భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 12న అంటే మ‌రి కొన్ని గంట‌ల్లోనే ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతోంది. అప్పుడే థియేట‌ర్ల వ‌ల్ల మ‌హేశ్ బాబు అభిమానులు సంద‌డి కూడా షురూ అయింది. మ‌రోవైపు మేక‌ర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.

ఇక తాజాగా `స‌ర్కారు వారి పాట‌`పై ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది. ఓవర్‌సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు `స‌ర్కారు వారి పాట‌`పై త‌న‌దైన శైలిలో రివ్యూ అండ్ రేటింగ్ ఇచ్చారు. ఇంత‌కీ ఆయ‌న ఏం చెప్పారంటే..` సర్కారు వారి పాట మాస్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే చిత్రం. యాక్షన్, ఎమోషన్స్, డ్రామా, కామెడీ సమపాళ్లలో కలగలిపి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. తెరపై మహేశ్‌ పెర్ఫార్మన్స్ అద్భుతం. ఆయ‌న న‌ట‌కు నేను ఫ్యాన్ అయిపోయాను.

కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే.. ఆమె లేకపోతే ఈ సినిమా అసంపూర్ణం. త‌న పాత్ర‌కు కీర్తి వంద శాతం న్యాయం చేసింది. మ‌హేశ్‌-కీర్తిల కెమిస్ట్రీ బాగా ఆక‌ట్టుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా బీభ‌త్సం సృష్టించ‌డం ఖాయం` అంటూ ఉమైర్ సంధు ఇన్‌స్టా వేదిక‌గా రాసుకొచ్చారు. అంతేకాదు, ఈ మూవీకి ఏకంగా 4.5/5 రేటింగ్ కూడా ఇచ్చారు. మొత్తానికి ఉమైర్ రివ్యూతో సినిమాపై వేరె లెవ‌ల్‌లో అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను మ‌హేశ్ అందుకుంటాడో..లేదో.. తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.


Share

Related posts

Adipurush : ఆదిపురుష్ కోసం ముంబై వెళుతున్న ప్రభాస్ .. భారీ యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ చేసేందుకే అంటూ టాక్..!

GRK

NTR : ఎన్.టి.ఆర్ ప్లేస్‌లో మహేష్..11 ఏళ్ళ తర్వాత క్రేజీ కాంబో రిపీట్..?

GRK

Tottempudi Venu: తొట్టెంపూడి వేణు జీవితం లో ఇంత దారుణం జరిగిందా ?

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar