Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `సర్కారు వారి పాట`. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు అందించాడు. మే 12న విడుదలైన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ నెగటివ్ టాక్ ను దాటుకుని.. అదిరిపోయే కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసే దిశగా దూసుకుపోతోంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 36.01 కోట్లు, రెండో రోజు రూ. 11.04 కోట్లు, మూడో రోజు రూ. 12.01 కోట్లు, నాలుగు రోజు 12.06 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఐదో రోజు మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్స్ ని తగ్గించకపోవడంతో ఈ మూవీ కేవలం రూ. 3.64 కోట్ల షేర్‌తో సరిపెట్టుకుంది. ఇక ఏరియాల వారీగా సర్కారు వారి పాట ఐదు రోజుల టోటల్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 28.67 కోట్లు
సీడెడ్: 9.34 కోట్లు
ఉత్తరాంధ్ర: 10.06 కోట్లు
తూర్పు: 6.87 కోట్లు
పశ్చిమ: 4.39 కోట్లు
గుంటూరు: 7.76 కోట్లు
కృష్ణ: 4.78 కోట్లు
నెల్లూరు: 2.89 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ= 74.76 కోట్లు(108.60 కోట్లు~ గ్రాస్)
———————-
రెస్ట్ ఆఫ్ ఇండియా+కర్ణాటక: 5.40 కోట్లు
ఓవర్సీస్- 11.20 కోట్లు
————————
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్: 91.37 కోట్లు(143.30 కోట్లు~ గ్రాస్)
————————
కాగా, వరల్డ్ వైడ్‌గా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సర్కారు వారి పాట.. రూ. 121 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఇప్పుడు ఈ మూవీ క్లీన్ హిట్‌గా నిలవాలంటే మొదటి ఐదు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 29.63 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. మరి మహేశ్ ఆ టార్గెట్‌ను రీచ్ అవుతాడో లేదో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!