YSRCP Rajya Sabha: ఏపి రాజ్యసభ అభ్యర్ధులను వైసీపీ ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్ధుల పేర్లను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం ఖరారు చేశారు. విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులను రాజ్యసభ అభ్యర్ధులుగా ప్రకటించారు. ఈ నలుగురు నేతలు తొలుత సీఎం వైఎస్ జగన్ తో సమావేశం అయ్యారు. సీఎంతో భేటీ అనంతరం రాజ్యసభ అభ్యర్ధుల పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లు మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీలో ముఖ్యనేతలతో సంప్రదించిన తరువాత పేర్లను ఖరారు చేసినట్లు తెలిపారు. విజయసాయిరెడ్డిని మరో సారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీసీ సంక్షేమం సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీదా మస్తాన్ రావు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్ పోస్టులైనా వైసీపీది ఒకటే దారి అని, జనాభా దామాషా మేరకు బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నామని చెప్పారు. ఈ నలుగురు రాజ్యసభ అభ్యర్ధుల్లో ఇద్దరు బీసీ నేతలని చెప్పారు. గత మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు సజ్జల.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…