సినిమా

నేను మహేష్ బాబు తో ఇండియానా జోన్స్ లాంటి సినిమా తీసి చూపిస్తా అంటున్న ఎస్. ఎస్. రాజమౌళి

S S Rajamouli and Mahesh Babu Upcoming Movie Latest Updates from Telugu Cinema
Share

S. S. Rajamouli and Mahesh Babu: టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మాట్లాడుతూ మహేష్ బాబు తో త్వరలో చిత్రీకరించబోతున్న సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి

Mahesh Babu's old movie Takkari Donga is very close to Rajamouli's upcoming Indiana Jones styled movie with Mahesh Babu
Mahesh Babu’s old movie Takkari Donga is very close to Rajamouli’s upcoming Indiana Jones styled movie with Mahesh Babu

మహేష్ బాబు తో తన సినిమా ఎలా ఉండబోతుంది, అసలు అది ఎలాంటి సినిమా, ఇలాంటి ఎన్నో విషయాలపై రాజమౌళి ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొంటున్న ఎస్. ఎస్. రాజమౌళి, అక్కడ ఉన్న వారితో తన కొత్త సినిమా గురించి మాట్లాడారు. తాను మహేష్ బాబు తో పని చేస్తున్నది ఒక ఇండియానా జోన్స్ ఇంకా జేమ్స్ బాండ్ లాంటి “గ్లోబ్‌ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్” సినిమా అని, ఇందుకోసం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా కథను రాస్తున్నాడు అని కూడా రాజమౌళి తెలిపారు.

ఎస్. ఎస్. రాజమౌళి చెప్పినట్లు “గ్లోబ్‌ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్” సినిమా అంటే ఏమిటి?

గ్లోబ్‌ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అంటే సినిమాలో కథానాయకుడు ప్రపంచం అంతా ప్రయాణం చేస్తూ సాహసం తో కూడిన విన్యాసాలు చేస్తుంటాడు. ఇలాంటి సినిమా గురించి ఉదహరణ ఇవ్వాలి అంటే అది అందరికి అర్ధం అయ్యే జేమ్స్ బాండ్ సినిమాలు అని చెప్పవొచ్చు.

Rajamouli's reference to his new movie with Mahesh Babu as Indiana Jones movie styled. In pictures: Indiana Jones Movies
Rajamouli’s reference to his new movie with Mahesh Babu as Indiana Jones movie styled. In pictures: Indiana Jones Movies

 

Mahesh Babu: మహేష్ బాబు ని ఇండియానా జోన్స్ లా చూడటం గురించి ఎస్. ఎస్. రాజమౌళి ప్రత్యేకంగా మాట్లాడారు

ఇండియానా జోన్స్ అనేది ప్రపంచం అంతటా భారీగా సక్సెస్ సంపాదించుకున్న అమెరికన్ హాలీవుడ్ మూవీ ఫ్రాంచైజీ. రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ ధ్వారా 1981 తెరమీదకు వొచ్చిన పాత్ర ఇండియానా జోన్స్. ఆ తరువాత 1984 లో ఇండియానా జోన్స్ మరియు టెంపుల్ ఆఫ్ డూమ్, 1989లో ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్, 2008లో ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్‌డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్ సినిమాలతో ఇండియానా జోన్స్ పాత్ర విశ్వం అంతా పేరు తెచ్చుకుంది.

అయితే ఇండియానా జోన్స్ ఫ్రాంచైజీ లోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్ 2023లో విడుదల కానున్న “ ఇండియానా జోన్స్ 5వ భాగం”.

ఈ సందర్భంలో ఎస్.ఎస్. రాజమౌళి తన మహేష్ బాబు తో కొత్త సినిమా ఇండియానా జోన్స్ సినిమా లాగా ఉంటుంది అని చెప్పడం అంతర్జాతీయ మీడియాకు ఇంకా మహేష్ బాబు అభిమానులకు చాలా సంతోషం కలిగించే వార్త.

రాజమౌళి: Mahesh Babu and Rajamouli Indiana Jones Movie
Mahesh Babu and Rajamouli Indiana Jones Movie

మహేష్ బాబు ఇంతకుముందే ఇండియానా జోన్స్ లాంటి సినిమా తీసాడు, కానీ టక్కరి దొంగ సినిమా చాలా పెద్ద ప్లాప్.

జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో మహేష్ బాబు ఇదివరకే 2002లో ఇండియానా జోన్స్ తరహా సినిమా ‘టక్కరి దొంగ’ తీసిన విషయం మహేష్ బాబు అభిమానులందరికి తెలిసిన విషయమే. బాలీవుడ్ లో “చోరోన్ కా చోర్” పేరుతో విడుదలైన టక్కరి దొంగ సినిమాలో మహేష్ బాబు వేసిన కౌబాయ్ పాత్ర ఇండియానా జోన్స్ పాత్రకు చాలా దెగ్గరగా ఉంటుంది. అయితే బిపాషా బసు ఇంకా మహేష్ బాబు కలిసి చేసిన ఏ సినిమా అభిమానులని నిరాశపరిచింది.

Mahesh Babu looking like Indiana Jones in Takkari Donga Movie
Mahesh Babu looking like Indiana Jones in Takkari Donga Movie

మహేష్ బాబు తండ్రి ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కూడా చాలా ఇండియానా జోన్స్ లాంటి సినిమాలు తీశారు. అసలు తెలుగు సినిమాలలో జేమ్స్ బాండ్ లాంటి “గ్లోబ్‌ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్” సినిమాలు మొదట తీసింది మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ

ఎస్.ఎస్. రాజమౌళి చెప్పిన “గ్లోబ్‌ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్” సినిమా గురించి మహేష్ బాబు ఇప్పటివరకు ఏం చెప్పాడు?

ఆ మధ్యలో ఒకసారి మహేష్ బాబు రాజమౌళి తో సినిమా గురించి మాట్లాడుతూ, “రాజమౌళి గారితో ఒక్క సినిమా తీస్తే 25 సినిమాలు తీసినట్టే”, అని చెప్పింది ఈ సినిమా గురించే. రాజమౌలి గారితో ఇలాంటి సినిమా తీయడం ఒక పెద్ద కల నిజమైనట్టే అని మహేష్ బాబు మురిసిపోయారు. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో మహేష్ బాబు చాలా బిజీ. సర్కారు వారి పాట తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ తో కలిసి తీస్తున్న సినిమా SSMB.

Mahesh Babu and Rajamouli Movie Latest Update
Mahesh Babu and Rajamouli Movie Latest Update

రాజమౌళి మహేష్ బాబుతో తీస్తున్న చిత్రం ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. ఈ పనులు పూర్తి చేసుకొని సినిమా షూటింగ్ ప్రారంభించేసరికి ఇంకొంత టైం పట్టచ్చు. మరి రాజమౌళి సినిమా అంటే ఎంత ఎదురుచూపులు ఉంటాయో మనకు తెలియని విషయమా చెప్పండి!

 

 

 

 


Share

Related posts

అలాంటి పాత్ర చేయాల‌నుంది

Siva Prasad

ష‌కీలా ల‌వ్ లెట‌ర్‌

Siva Prasad

ర‌కుల్ మ‌న‌సు ప‌డ్డ హీరో

Siva Prasad